ఆంధ్రప్రదేశ్:తాడిపత్రి మండలంలో శ్రీ సత్యసాయి నీటి సరఫరా (శ్రీ సత్యసాయి వాటర్ సప్లై)కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారం 14వ రోజుకు చేరుకుంది.పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళన చేపట్టారు.
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్,వైఎస్సార్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు.“న్యాయం జరిగే పోరాటం ఆగదు, ప్రజల దాహం తీర్చే కార్మికులు మాడ్చొద్దు” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.గత ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని అన్నారు.ప్రజలకు నిత్యం తాగునీరు అందించడం తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు.
జేఏసీ నాయకులు (JAC నాయకులు )రంగనాయకులు, శ్రీనివాసులు మాట్లాడుతూ.సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతన చట్టం ప్రకారం గౌరవప్రదమైన జీతాలు చెల్లించాలని.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు ఉమా గౌడ్ పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.
ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కార్మిక సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.


