ధురంధర్ 2 వివాదం: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ధురంధర్ 2’ చిత్రం రీసెంట్ గానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఓవర్సీస్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో , అంతకు మించిన రేంజ్ ఓటీటీ లో కూడా వచ్చింది. థియేటర్లలో ఇప్పటి వరకు ఈ చిత్రం 1850 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి, ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ఈ చిత్రం రన్ అవుతూనే ఉంది. బుక్ మై షో లో గడిచిన 24 గంటల్లో 12 వేల టిక్కెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా నాలుగు గంటల నిడివి ఉన్నటువంటి సినిమాని థియేటర్స్ కి వెళ్లి చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడుతున్నారంటే సాధారణ విషయం కాదు.
ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ‘ధురంధర్ 2’ చిత్రం సరికొత్తగా చిక్కుకుంది. ఢిల్లీ హై కోర్టు లో ఈ చిత్రం పై ఒక పిటీషన్ దాఖలు అయ్యింది . ఈ సినిమాలో, సాయుధ కార్యకలాపాల వివరాలను బహిర్గతం చేసారని, ఇది దేశ భద్రతకు పెద్ద ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉందని, సశత్ర సీమ బల్ (SSB) లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న దీపక్ కుమార్ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ సినిమా కచ్చితంగా కల్పిత కథ నే అయ్యుండొచ్చు, కానీ భద్రతాదళ సిబ్బంది లేవనెత్తినా ఈ క్షణం తేలికగా తీసుకోలేదని హై కోర్టు చెప్పుకొచ్చింది. ఈ ఆరోపణలపై నిజానిజాలేంటో విచారణ చేపట్టాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెట్ (CBFC) బోర్డుని హై కోర్టు ఆదేశించింది . మరి సెంట్రల్ బోర్డు ఏమని వివరణ ఇస్తుందో చూడాలి.
నిజానికి ‘ధురంధర్ 2’ చిత్రం కల్పిత కథనే. కానీ పూర్తి స్థాయి కల్పిత కథ మాత్రం కాదు. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని , దానికి ఫిక్షన్ ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. భద్రతా దళాలు రెండు దేశాల్లోనూ ఎలా పని చేస్తున్నాయి?, పొలిటికల్ సిస్టం ఎలా రన్ అవుతుంది , ఇండియన్ ఆర్మీ లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు వంటి అంశాలు ఈ చిత్రంలో చూపించారు. అందుకే ఇప్పుడు నేరుగా CBFC రంగం లోకి దిగాల్సి వచ్చింది. ఒక సినిమా ని ఉన్నది ఉన్నట్లుగా చూపించాలంటే ఈ మాత్రం అడ్డంకులు రావడం సహజమే.

