– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: ఈ 3న నిర్వహించిన నీట్(NEET)-యూజీ పరీక్ష రద్దైన విషం గురించి తెలుస్తుంది. రాజస్థాన్లో పేపర్ లీక్ కావడంతో పరీక్ష రద్దు చేసి రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. వచ్చే నెల జూన్ 21 రీ ఎగ్గామ్ నిర్వహించబడుతుంది. నీట్ పేపర్ లీక్జీపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు, తల్లిదండ్రులు భగ్మంటున్నాయి. మోడీ సర్కార్ నిర్లక్ష్యంతో పదే పదే నీట్ పేపర్ లీక్ అవుతుందని మండిపడుతోంది. తాజాగా ఢిల్లీలో NTA ఆఫీస్ ఎదుట విద్యార్థుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. NTAను రద్దు చేయాలనీ, విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలనీ NSUI డిమాండ్ చేసింది. మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనకారుల నినాదాలు చేశారు. అప్రమమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారందర్నీని పోలీస్ వ్యాన్లోకి ఎక్కించి స్థానిక పీఎస్లకు తరలించారు.
– ప్రకటన –

