రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ శంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేవి, దానం చేస్తే దానికి అర్హమైనవి రెండు కళ్ళు మాత్రమే నని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్. శంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచనేత్ర దాన దినోత్సవం పై ప్రజలకు పలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చనిపోయిన తర్వాత ఇద్దరి కళ్ళను దానం చేస్తే, ఆ రెండు కళ్ళను నల్ల గుడ్డుపై పోయి, అందంతో బాధపడే వారికి అమర్చితే కంటి చూపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. మనిషి తర్వాత ఆరు గంటల లోపు రక్త బంధువులు దగ్గరలోని నేత్ర నిధికి గాని, కళ్ళు సేకరించే స్వచ్ఛంద సేవా సంస్థలకు గాని, కళ్ళు సేకరించే కేంద్రానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని తెలిపారు. ప్రస్తుతం కంటిలోని నల్ల గుడ్డుపై ఉన్న తెల్లటి పొరలు మాత్రమే సేకరిస్తున్నారని, కాబట్టి మరణించిన వ్యక్తి ముఖములో ఎటువంటి మార్పు కాన పడదు అని స్పష్టం చేశారు. స్వీకరించిన కళ్ళను అవసరమైన వారికి ఉచితంగా అమర్చబడుతుంది. నేత్రదానానికి అన్ని వయసుల వారు అర్హులని, చక్కెర వ్యాధిగ్రస్తులు, కంటి శుక్లాం ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా కళ్ళు దానము చేయవచ్చని తెలిపారు. పచ్చకామర్లు, క్యాన్సర్, పిచ్చికుక్క కాటు కారణంగా మృతి చెందిన వారి కళ్ళు నేత్రదానానికి పనికిరాదు అని చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా నేత్రదానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, సమాజాన్ని ప్రోత్సహిస్తే, చూపులేని నిర్భాగ్యుల జీవితాలకు వెలుగును ప్రసాదించిన వారు అవుతారని చెప్పారు. ఆ విధంగా చనిపోయిన తర్వాత కూడా వారి కళ్ళ ద్వారా మరల జీవించవచ్చునని వారు స్పష్టం చేశారు.

