పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెప్పారు. పవన్ కల్యాణ్ రావచ్చు… పోవచ్చు అని అన్నారు. ఇక్కడ కూడా పోటీ చేయవచ్చు అని తెలిపారు. గతంలోనూ పవన్ కల్యాణ్ పోటీ చేశారు. పవన్ కల్యాణ్ వేసిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీలో జగన్ సభలకు కూడా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న కేబినెట్ సక్రమంగానే ఉందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ మంత్రులుగా అర్హులేనని చెప్పారు. ఎవరైనా రాహుల్ ను కలవొచ్చని రేవంత్ రెడ్డి అన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను కావాలంటే అక్కడి రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. మీనాక్షి నటరాజన్ పై ఎటువంటి కేసు లేదని చెప్పారు. జులైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో భేటీ ఉంటుందని అన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు.

