ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న రెండు పార్టీల మధ్య సమన్వయం సాధించే దిశగా పై స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి. ఈ విధంగా ఇటు టిడిపిలో అటు జనసేనను నాయకత్వాన్ని ముందుకు నడిపించడానికి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి సంబంధించి మహానాడులో తీసుకున్న నిర్ణయం ప్రకారం అటు పసుపు సేన ఇటు జనసేన నాయకులను ముందుకు నడిపించడానికి అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ నిర్ణయించనుంది.
దీని ప్రకారం క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలను నాయకులు కూడా సమన్వయం చేయడంతో పాటు ఉమ్మడిగా కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ ప్రాధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ఫలితంగా ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో కొంతమేరకు ఇబ్బందికర పరిణామాలు అనేక నియోజకవర్గాల్లో మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో కలిసికట్టుగా ప్రజల మధ్యకు వెళ్లడంతో పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకు ఈ ప్రయత్నం ఫలిస్తుంది.
వాస్తవానికి ఇప్పటివరకు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో గత ఎన్నికలకు ముందు ఉన్న కలివిడితనం ఈ రెండు పార్టీలలో ఇప్పుడు నడుస్తోంది. నాయకుల మధ్య.. విభేదాలు, కామన్ గా మారాయి. దీంతో వచ్చే ఎన్నికల వరకు వేచి చూస్తే ఇబ్బందికర పరిణామాలు తప్పవని భావించిన పార్టీలు ఉమ్మడిగా సమన్వయం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా మహానాడులో కూడా ఈ విషయంపై చర్చించారు.
ప్రధానంగా ముందుకు సాగడం ద్వారా పార్టీలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే మళ్ళీ విజయం సాధించగలం అన్న బలమైన సంకేతాన్ని టిడిపి శ్రేణులకు పంపించినట్లు అయింది. కాబట్టి ఈ ఏర్పాటునే పసుపు సేన -జనసేన నాయకులు, కార్యకర్తలు మధ్య సమన్వయం కల్పించేందుకు కమిటిని చేసి ప్రజల మధ్యకు వెళ్లేందుకు అవకాశం కలిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఇక క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వంతో పాటు కార్యకర్తలను నడిపించే అవకాశం కూడా ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు.

