కలర్స్ స్వాతి: యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం అనేది సాధారణ విషయం కాదు. అప్పట్లో ఝాన్సీ యాంకరింగ్ రంగం లో ఒక వెలుగు వెలిగింది , ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా కూడా బాగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ ఆమె పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా కెరీర్ ని గడుపుతోంది. మరోపక్క ఉదయభాను వంటి వారు కూడా యాంకరింగ్ రంగం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొంతమేరకు సక్సెస్ ని చూసింది. అయితే యాంకరింగ్ రంగం లో సెన్సేషన్ సృష్టించిన సుమ , రష్మీ వారు యాక్టర్స్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, అనసూయ మాత్రం చాలా పెద్ద రేంజ్ కి వెళ్ళింది. అయితే యాంకరింగ్ రంగం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా సక్సెస్ అయిన ఏకైక నటి కలర్స్ స్వాతి.
అప్పట్లో జెమినీ టీవీలో ప్రసారమైన ‘కలర్స్’ అనే టీవీ షో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది, ఈ షో కి యాంకర్ గా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది స్వాతి. ఆ క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె , మొదట్లో కొన్ని క్యారెక్టర్ రోల్స్ లో మెరిసింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది. అయితే గత సంవత్సరం నుండి సినిమాలకు దూరంగా కలర్స్ స్వాతి, రీసెంట్ గానే ‘పంచతంత్రం’, ‘మంత్ ఆఫ్ మధు’ వంటి చిత్రాలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈమధ్య కాలం లో ఈమె తన భర్త వికాస్ వాసు తో విడాకులు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె పెళ్లి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఒక్క మాటతో ఆమె తన వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుందో చెప్పకనే చెప్పినట్టు అనిపించింది. ఈ కాలం లో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే, కుక్కల్ని పెంచుకోవడం ఏంటో బెటర్, అవి ప్రేమగా , బ్రతికి ఉన్నంత కాలం మనతోనే సంతోషంగా ఉంటుంది, మోసం లాంటివి చేయడం చేత కాదు అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది స్వాతి. 2018 వ సంవత్సరంలో వికాస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది కలర్స్ స్వాతి. అప్పటికి ఆమె కెరీర్ పరంగా పీక్ రేంజ్, అలాంటి కెరీర్ ని భర్త కోసం వదిలేసింది, ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా కెరీర్ కొనసాగితే చాలా పెద్ద రేంజ్ కి వెళ్లి ఉంటుందని అనుకోవచ్చు.

