Published on: 7:39 pm, 26 మే 2026
పోక్సో కేసులో బండి భగీరథ్ మే నెల 16వ తేదీన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైల్లో భగీరథ్ జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు కస్టడీకి కోరకపోవడంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు పోలీసులు భగీరథను కస్టడీకి నిర్ణయించారు.
ఈ కోరనే భగీరథ్ ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్ గిరి కోర్టు అనుమతించింది. అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వారం రోజుల కస్టడీకి ఇచ్చిన పోలీసులు. కానీ, కోర్టు మూడు రోజులకే అనుమతించింది. పోలీసుల విచారణలో ఏ విషయాలు వెల్లడి కాబోతున్నాయి అన్న అంశంపై సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది.

