ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్ సీడీఏ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో రేవంత్ పాల్గొన్నారు.. భవిష్యత్తులో టోక్యో, సింగపూర్‌లతో మన ఫ్యూచర్ సిటీ పోటీపడుతోంది. రాబోయే 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని పూర్తి చేసి చూపిస్తాం కడుపునిండా విషం, కళ్లనిండా నిప్పులతో ఫ్యూచర్ సిటీని రద్దు చేసిన ప్రగల్భాలు పలుకగా ఫైర్ అయ్యారు సీఎం. గుర్తుపెట్టుకోండి… ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వారికి ఈ రాష్ట్రంలోనే ఫ్యూచర్ లేదు! భవిష్యత్తును రద్దు చేస్తామంటే… మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని ఎంతో మంది అభివృద్ధి చేశారు. కానీ, ఈరోజు రాష్ట్ర ఆదాయానికే కీలకంగా మారిన సైబరాబాద్‌కు… రేపాటి భవిష్యత్ కోసం ఈనాడు పునాది వేశామన్నారు. బంగారం సైబరాబాద్‌లోనే భూములకు విలువ ఎక్కువని రేవంత్ అన్నారు. నాడు హైటెక్ సిటీ వద్దన్నారు, ఓఆర్ ఆర్ వద్దన్నారు, ఎయిర్ పోర్ట్ వద్దన్నారని చెప్పారు. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా సిటీ విస్తరణను అడ్డుకుంటున్నారని చెప్పారు.
►ఇంకా చదవండి | తెలంగాణ మీ అయ్యా జాగీరా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ క్లారిటీ
నిన్న కురిసిన కేవలం రెండు గంటల వానకే సిటీ ఆగమైపోయింది రేవంత్. కిలోమీటర్ ప్రయాణానికే గంటల సమయం పట్టింది. పదేళ్లు మేమే అభివృద్ధి చేశామన్నోళ్లు… ఈ సిటీ వరదపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జా సహించేది లేదని హెచ్చరిక చేస్తే సీఎం రేవంత్. మేంగానీ, మా మంత్రులు గానీ గజం భూమైనా ఆక్రమించామా? గత పాలకులు దుర్మార్గుల్లా చెరువులు, పార్కులు కబ్జా చేయబడ్డాయి. అంబర్ పేట్ చెరువును, బతుకమ్మ కుంటలో 15 ఎకరాలు ఎడ్ల సుధాకర్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నేతలకు రాసిచ్చారని తెలిపారు. ఆ పాపపు కబ్జాల వల్లే… ఈరోజు చెరువుల్లో ఉండాల్సిన వరద రోడ్లపైకి వచ్చింది. ఇదేనా మీ పదేళ్ల పాలన? మీరు అడ్డుకున్నా… అభివృద్ధి ఆగదు. కేవలం 170 రోజుల్లోనే బిల్డింగ్ నిర్మించి ప్రారంభించిన చరిత్ర మాది అన్నారు రేవంత్.

