అత్యధిక వసూళ్లు సాధించిన ప్రీమియర్ షోలు: ఒకప్పుడు ప్రీమియర్ షోస్ అంటే కేవలం ఓవర్సీస్ లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ ఇండియాలో కూడా వచ్చేసింది. చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడా లేదు, ప్రతీ సినిమాకు ప్రీమియర్ షోస్ వేస్తున్నారు నిర్మాతలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ప్రీమియర్ షోస్ ద్వారా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితా ఒకసారి చూద్దాం. ఈ ట్రెండ్‌లో అందరూ ఊహించినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ’ భారీ అంచనాల నడుమ గత ఏడాది విడుదలై ఎంతటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పిందో మనందరికీ తెలుసు. ఈ సినిమాకు ప్రీమియర్ షోస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇదే ఇప్పుడు స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత స్థానం లో ‘ధురంధర్ 2’ చిత్రం నిలిచింది. ‘ధురంధర్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీవెల్ కావడం తో ఈ చిత్రం హిందీ మార్కెట్ లోనే కాదు , సౌత్ మార్కెట్ లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ కారణం చేతనే ఈ నిర్మాత మేకర్స్ ప్రీమియర్ షోస్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేశారు. సీసీస్ లో కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాల 61 కోట్ల రూపాయి గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోలు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ చిత్రం రెండవ స్థానం లో కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం కొనసాగుతుంది. భారీ క్రేజ్‌తో విడుదలైన ఈ ప్రీమియర్ షోస్ ద్వారా 48 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో లేటెస్ట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది చిత్రం నిలిచిపోయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా 42 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కాస్త తగ్గింది , లేదంటే ఈ చిత్రం 50 కోట్ల మార్కుని దాటి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక 5వ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ చిత్రం కొనసాగుతుంది. ఈ చిత్రం దాదాపుగా 39 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చాయి. నైజాం ప్రాంతంలో ప్రీమియర్ షోస్ పడలేదు , లేదంటే ఈ చిత్రం కూడా 50 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి ఉండేది. ఇక ఆ తర్వాత ఆరవ స్థానం లో పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రం కొనసాగుతోంది.

