బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. అతివేగంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ఢీకొనడం తో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు
దర్యాప్తు చేపట్టారు.

