భారత రూపాయి క్షీణత: క్రమంగా… రూపాయి విలువ పడిపోయింది.. జీవితకాల కనిష్టానికి చేరుతుంది.. డాలర్ విలువ అంతకంతకు పెరుగుతోంది.. ఈ పతనం ఎక్కడైనా.. దీనివల్ల విదేశీ మారక ద్రవ్య నిలుపుదల ఒత్తిడి పెరిగిపోతుంది.. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడుతుందని మన నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని.
బంగారం కొనుగోలు చేయొద్దని.. విదేశాలకు వెళ్లొద్దని.. ఆడంబరాలకు పోకూడదని.. ఉన్నంతలో బతకాలని ఇంకా రకరకాల పొదుపు సూత్రాలను ఆయన చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆయన చెప్పినట్టుగానే బంగారం మీద చాలామంది వ్యామోహం తగ్గించుకున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి తగ్గించుకున్నారు. ఇంకా వివిధ పొదుపు చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. అయినప్పటికీ డాలర్ పెరుగుతూనే ఉంది. రూపాయి మీద ఒత్తిడి ఎక్కువ అవుతూనే ఉంది.. ఎందుకిలా..
నిజానికి మనదేశంలో బంగారం మీద మాత్రమే కాకుండా.. ఇంకా అనేక రకాల వస్తువుల మీద విదేశీ మారకద్రవ్యాన్ని మన ప్రభుత్వం ఖర్చుపెడుతోంది. అందులో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు తయారీకి ఉపయోగించే చిప్.. ఇతర వస్తువుల కోసం భారీగా వెచ్చిస్తోంది. అదేంటి స్మార్ట్ ఫోన్ల తయారీ మన దేశంలో పెరిగిపోయింది కదా.
స్మార్ట్ ఫోన్ల తయారీకి ఉపయోగించే చిప్ లు, ఇతర రా మెటీరియల్ మొత్తం చైనా లేదా తైవాన్ నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మన దేశం నుంచి వేరే ఏడు విలువైన ఫోన్ ఒకటి తయారుచేసి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే.. అందులో వాడే ముడి పదార్థాలు.. ఇతర పరికరాల కోసం దాదాపు మూడు డాలర్ల వరకు ఖర్చు పెట్టాలి. అన్నీ కూడా విదేశాలకు చెల్లించాలి. వాటిని డాలర్ రూపంలో చెల్లిస్తే మనకు ఆ పరికరాలు దిగుమతి అవుతాయి. ప్రస్తుతం మనదేశంలో స్మార్ట్ పరికరాల తయారీ పెరిగిపోయింది. మేక్ ఇన్ ఇండియా.. మేడిన్ ఇండియా అని నినాదాల వల్ల స్థానికంగా అనేక ఉత్పత్తులు తయారవుతున్నాయి. వీటి తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి వస్తుంది. అందువల్లే భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది.
చాలామంది అనుకుంటున్నట్టుగా బంగారం కోసం.. యూరియా కోసం.. ఇతర వాటి కోసం మన దేశం భారీగా విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెడుతున్న విషయం తెలిసిందే. వాటికంటే ఎక్కువగా స్మార్ట్ ఫోన్ పరికరాల కోసం వెచ్చిస్తోంది. అందువల్లే రూపాయి మీద ఒత్తిడి పెరిగిపోతోంది.. అయితే విదేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల మరికొద్ది సంవత్సరాల్లో మనదేశంలో కూడా చిప్ తయారీ కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మన దేశంలోనే అవి తయారవుతాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అప్పటిదాకా ఈ సమస్యలను ఎదుర్కోవాల్సిందే.

