- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
- 10 గ్రాములపై రూ.2,940 పెరిగిన బంగారం ధర
- కిలో వెండిపై రూ.5 వేల హైక్
హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి: వరుసగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. మళ్లీ భారీగా పెరిగాయి. శుక్రవారం (జూన్ 12) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.294 పెరిగి రూ.14,858కు చేరుకుంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,940 పెరిగి రూ.1,48,580గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.270 పెరిగి రూ.13,620కి చేరుకోగా.. 10 గ్రాముల ధర రూ.2,700 పెరిగి రూ.1,36,200కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. గ్రామానికి రూ.221 పెరుగుదలతో రూ.11,144గా నమోదైంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,440కు చేరుకుంది.
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.5,000 పెరిగి.. రూ.2,65,000కు చేరుకుంది. దీనితో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా అదనపు భారం పడనుంది. జూన్ 11న 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,564గా ఉండగా.. జూన్ 12న అది రూ.14,858కి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.13,350 నుంచి రూ.13,620కి చేరింది. అంతకుముందు జూన్ 11న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,130 తగ్గి రూ.1,45,640కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,950 తగ్గి రూ.1,33,500 వద్ద నమోదైంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదల, డాలర్ మారకపు విలువలో మార్పులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో దేశీయంగా ధరలు కూడా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి బంగారం, వెండి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బంగారాన్ని కొనుగోలు చేసే వారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బంగారం, వెండి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే వారికి ఈ పెరుగుదల భారీగా మారనుంది.

