హైదరాబాద్: జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లోని కౌకూర్‌లో రిర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో దోపిడీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరేడ్మెట్లో శనివారం నిర్వహించినసీపీ మల్కాజిగిరి డీ సుమతి వివరాలు.
నేపాల్‌కు చెందిన మీనా అలియాస్ మమత, రాజేష్‌లు కొన్ని నెలల క్రితం కౌకూర్‌లోని రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీమోహన్, విజయలక్ష్మి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఇంట్లో దంపతులు మాత్రమే ఉంటున్నారని, భారీగా నగదు, బంగారం, వెండి ఉన్నాయని పేర్కొన్నారు. సొత్తు దోచుకోవాలని భావించిన మమత.. మరోచోట పనిచేస్తున్న నేపాలీయులు రాజేష్, సబీనా, చాంగ్, సామ్రాట్, బిశ్వాల్, కమల్, శంకర్‌లతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించారు.
ఈ నెల 11న తన పుట్టినరోజు అంటూ మమత అబద్ధం చెప్పి గ్యాంగ్‌తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్‌లో వేడుకలు జరుపుకుంది. అనంతరం రాత్రి 8.30 గంటల సమయంలో గ్యాంగ్ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించారు. మురళీమోహన్, విజయలక్ష్మిలను కట్టేసి మత్తు పదార్థాలు ఇచ్చారు. తర్వాత బీరువాలు పగులగొట్టి సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, మూడు వేల డాలర్లు దోచుకెళ్లారు.
సికింద్రాబాద్ స్టేషన్లో పట్టివేత
దోపిడీ తర్వాత కొందరు ఆటోలో, మరికొందరు స్కూటర్‌పై యాప్రాల్‌కు చేరుకున్నారు. అక్కడ స్కూటర్ వదిలేసి రెండు ట్యాక్సీల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోవాలని ప్రయత్నించారు.
ఈ రోజు క్రితం మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో మీనా, రాజేష్‌ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సేకరించిన వేలిముద్రలు మీనా వేలిముద్రలతో సరిపోలాయి. దీనిపై దర్యాప్తు వేగం పెంచిన పోలీసులు.. సునీత, బిశ్వాల్, కమల్ బహదూర్, శంకర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాంగ్ లీడర్ మమత, రాజేష్‌తో పాటు మరికొందరు పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు. వారిని త్వరలో అరెస్ట్ చేశారు.
250 సీసీ కెమెరాల పరిశీలన
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సరిహద్దు ప్రాంతాలకు కూడా బృందాలను పంపించారు. 250కిపైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి సమాచారంతో ఐదు రోజుల పాటు నిరంతరం శ్రమించి నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

