యువతపై ఒక ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలకు నిరసనగా సెటైరికల్ గా మొదలైన కాక్రోచ్ మూవ్ మెంట్.. సీరియస్ స్టాండ్ తీసుకుంది. ఇండియాలో బీజేపీ లాంటి పార్టీలన దాటి సోషల్ మీడియాలో ఫాలోవర్లను సంపాదించింది కాక్రోచ్ జనతాపార్టీ. ఇండియాలో మొదలైన ఈ జెన్-జీ ల ఉద్యమం ఇప్పుడు బార్డర్ దాటేసింది. లేటెస్టుగా పొరుగు దేశమైన పాకిస్థాన్ లోనూ బొద్దింక పార్టీ పాగా వేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పాక్ లో కూడా సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది.
అయితే పాక్ లో కాక్రోచ్ జనతా పార్టీకి చాలా వర్షాలు ఏర్పాటయ్యాయి. కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తహిద కాక్రోచ్ మూవ్ మెంట్ పేరుతో సోషల్ మీడియాలో సెటైరికల్ పార్టీల పేజ్ లు ప్రారంభమయ్యాయి. కాక్రోచ్ అవామీ పార్టీ.. ఎ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ యూత్, బై ద యూత్, ఫర్ పాకిస్థాన్ అనే ట్యాగ్ లైన్ తో క్రియేట్ చేశారు.
ఈ వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా పరిగణిస్తోందో.. మేము వారి గొంతుకలం అంటూ ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఏర్పాటైన కాక్రోచ్ పార్టీల లోగోలు కూడా దాదాపు ఇండియాలో ఉద్యమానికి బీజం వేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) లోగో మాదిరిగానే ఉన్నాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులతో లోగోలు రూపొందించారు.
పాకిస్తాన్లో ఏర్పాటైన ఇమ్రాన్ ఖాన్ – పాకిస్తాన్ తెహరీక్-ఎ-ఇన్సాన్ (పిటిఐ), పాకిస్తాన్ ముస్లీం -నవాజ్ (పిఎమ్ఎల్-ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) మొదలైన పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి అక్కడి యువత ప్రకటించుకుంది.
సెటైరికల్ గా మొదలై.. సీరియస్ డిబేట్..
‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ మహారాష్ట్రకు చెందిన అభిజిత్ దీప్కే అనే 30 ఏండ్ల యువకుడి ఆలోచన నుంచి మే 16న పుట్టింది. కానీ ఇది రాజకీయ పార్టీ కాదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తే సోషల్ మీడియా పార్టీ. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ఏర్పాటు చేసిన పార్టీకి జనం నుంచి అపూర్వ మద్దతు లభించింది. ఎంతలా అంటే జస్ట్ ఆరునే రెండు కోట్ల మంది ఆ సెటైరికల్ పార్టీని ఫాలో అవడం మొదలుపెట్టారు.
గంటగంటకూ ఫాలోవర్లు పెరుగుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్యను సీజేపీ దాటేసింది. దేశంలోని పరిస్థితులపై జెనీ తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నారని ఈ పరిణామం రుజువు చేస్తోంది.

