నరేంద్ర మోదీ త్వరలో ప్రధానిగా పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకోనున్నారు. అత్యంత ఎక్కువ సమయం ప్రధానిగా భారత్ ను పాలించిన మోదీ రికార్డులను బ్రేక్ చేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ సంబరాలను నిర్ణయించింది. మోదీ పన్నెండేళ్ల పాలన సందర్భంగా బీజేపీ భారీ వేడుకలు నిర్వహించనున్నారు.
జూన్ 5వ తేదీ నుంచి 21వరకు…
జూన్ 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వాసం-వికాసం-జన సంక్షేమం పేరుతో ప్రచార యాత్రలు నిర్వహించనున్నారు. యోగా, మొక్కలు నాటడం, స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం కేంద్ర పార్టీ నాయకత్వం ఆదేశించింది. స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యతఇవ్వాలని బీజేపీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.

