మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (పెద్ది). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, క్లీన్ U/A సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. లేటెస్ట్ గా భోపాల్‌లో ‘హల్లల్లో’ స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
ముంబై తర్వాత.. భోపాల్ షేక్ !
ఇటీవలే ముంబై ఈ ట్రైలర్లో మైండ్ బ్లోయింగ్ లాంచ్‌తో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన చిత్రయూనిట్.. రోజు (మే 23న) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అంతకుమించి భారీ అవుట్డోర్ ఈవెంట్‌ను నిర్వహించింది. స్టేడియం మొత్తం వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయింది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్ర యూనిట్ అంతా హాజరైన ఈ వేడుకలో.. ఆస్కార్ విజేత, లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి స్టేజ్ పై మ్యాజిక్ చేశారు. ఈ కిక్కిరిసిన భారీ అభిమానుల కోలాహలం మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘హల్లల్లో’ అనే స్పెషల్ సాంగ్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు.
‘హల్లల్లో’ సాంగ్‌లో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ వేసిన ఊరమాస్ స్టెప్పులు ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పిస్తున్నాయి.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన హై-వోల్టేజ్ బీట్స్‌కు.. రక్షితా సురేష్ గాత్రం, అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ తోడవడంతో ఈ పాట ఇన్‌స్టాంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. ఈ సాంగ్ వింటుంటే థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోవడం ఖాయంగా మారింది.
సెన్సార్ కట్స్ ఇవే !
మరోవైపు, సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్ ఏకంగా 189 నిమిషాలు (3 గంటల 9 నిమిషాలు) ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. కథలోని ఎమోషన్, రామ్ చరణ్ పవర్ ఫుల్ స్పోర్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండటం వల్లే లెంత్ ఎక్కువైనా ఎక్కడా ట్రిమ్ చేయలేదని తెలుస్తోంది.
►ఇంకా చదవండి | జగపతి బాబు: నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు అండగా ప్రభాస్… జగ్గుభాయ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
అయితే, సినిమాలో ఉన్న కొన్ని బూతు పదాలను సెన్సార్ బోర్డు మ్యూట్ చేసింది. ముఖ్యంగా, ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ‘చికిరి చికిరి’ సాంగ్‌లో వివాదాస్పదంగా మారిన ‘సరుకు సామాన్’ అనే లిరిక్‌ను సెన్సార్లతో పూర్తిగా మార్చేసి, దాని స్థానంలో సరికొత్త క్లీన్ లైన్‌ను జోడించారు.
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా భోపాల్ ఈవెంట్‌తో హిందీ బెల్ట్‌లో కూడా ‘పెద్ది’ సృష్టించిన ఈ భారీ మొమెంటం సినిమాకు రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తేవడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

