– ప్రకటన –
నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలోని సీఎస్ఐ చర్చి ఆవరణలో ఏసుక్రీస్తు పునరుత్థాన జాతర మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం 4:30 గంటల వరకు స్థానిక ఇన్చార్జి గురువులు ఎం రవి కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మూడవ దినమున తిరిగి లేచి పునరుత్తానుడైనాడని వివరించారు.వివిధ గ్రామ సంఘాలకు వచ్చిన ప్రజలకు అల్మాయిపేట గ్రామ సర్పంచ్ బేగరి దుర్గాప్రసాద్ వారి కుటుంబం తరపున భోజనాలను ఏర్పాటు చేశారు. అనంతరం పాటలు పాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ టి భాస్కర్, మినిస్ట్రియల్ సెక్రెటరీ రేవ కెఆర్ఎస్ ప్రేమ్ సుకుమార్, విమల్ సుకుమార్ గురువు సినాద్, మెదక్ అధ్యక్షుడు మండలం ట్రెజరర్, రేవ కేజేమ్స్ సిసిల్ విక్టర్ మినిస్ట్జార్ బోర్డు కన్వీనర్ మెదక్సి మెదక్, రెవ డా ఎండీ ఇన్స్టార్ చైర్మన్ రవికుమార్,ఎన్ భాస్కర్, కమిటీ సభ్యులు అశోక్ కుమార్, రాజు, పురుషోత్తం, కరుణాకర్, సంసన్, యూత్ సభ్యులు, సండే స్కూల్ పిల్లలు, వివిధ గ్రామాల ప్రజలు, నాయకులు అధిక సంఖ్యలో ఉన్నారు.
– ప్రకటన –

