ఏపీ మంత్రి నారా లోకేష్‌ను సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ కలిసారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధి, వినోద ఆవిష్కరణలు, యువత ప్రోత్సాహంపై చర్చించారు. ఈ వివరాలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
జాంటీ రోడ్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందన్న నారా లోకేష్.. ఆయన అభిరుచి, క్రమశిక్షణ, సాధించాలనే తపన ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది. క్రీడలు, యువత అభివృద్ధి వంటి అనేక అంశాలను ఆయనతో చర్చించినట్లు లోకేష్ పేర్కొన్నారు.
‘అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు అవలంబించడం, రాబోయే తరం ఛాంపియన్లను తీర్చిదిద్దడంపై ఇద్దరం చర్చించాం. ఏపీని ప్రపంచస్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచవ్యాప్త క్రీడాకారుల్లో జాంటీ రోడ్స్ స్ఫూర్తి నింపారు. ఆయనను కలవడం చాలా సంతోషంగా ఉంది.’అని లోకేష్ ట్వీట్ చేశారు.
ఈ భేటీ సందర్భంగా నారా లోకేష్.. ఆయనకు యువగళం పాదయాత్ర విశేషాలతో కూడిన పుస్తకాన్ని బహుకరించారు. ఇక తాను సంతకం చేసిన బ్యాట్‌ను నారా లోకేష్‌కు జాంటీ రోడ్స్ బహుమతిగా ఇచ్చింది.
మరోవైపు రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే నూతన క్రీడా కార్యక్రమాలను అందించింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి చోట్ల ప్రత్యేక క్రీడా కారిడార్ల అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు కూడా మూడు పెరిగాయి.
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించే క్రీడాకారులకు కూడా నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచింది. ప్రాథమిక స్థాయి నుంచే పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో స్కూల్ లెవల్ నుంచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్కులతో పాటు స్పోర్ట్స్ రిపోర్ట్ కార్డ్స్ అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాజమండ్రి, విజయవాడ, కుప్పం, శ్రీకాకుళంలో ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చెందుతాయి.
దిగ్గజ జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉంది, అతని అభిరుచి, క్రమశిక్షణ మరియు శ్రేష్ఠతను సాధించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది.
క్రీడలు, యువత అభివృద్ధి మరియు శ్రేష్ఠత సంస్కృతిని సృష్టించడంపై మేము ఆకర్షణీయంగా చర్చించాము. ఆంధ్రప్రదేశ్… pic.twitter.com/Rjuv4XZuU2
– లోకేష్ నారా (@naralokesh) జూన్ 16, 2026 ">

