పశ్చిమ బెంగాల్ లో టీటీడీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ర్యాలీలో ఉద్రికత్త ఏర్పాటు. కోల్ కతాల్లో టీఈ ర్యాలీపై కోడిగుడ్లు విసిరారు దుండగులు. బారుయిపూర్లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా నిర్వహించిన ర్యాలీపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్డు విసరడంతో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మద్య ఘర్షణ జరిగింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
బారుయిపూర్లో 11ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు నిరసనగా మాజీ సీఎం మమతా బెనర్జీ తన కార్యకర్తలతో కలిసి భారీ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బల్లిగంజ్ ఫారి నుంచి హజ్రా మోర్ వరకు సాగిన ఈ ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మమత బెనర్జీ నివాసం సమీపంలో హజ్రా క్రాసింగ్ దగ్గర టీటీడీ కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. మమతను ముందుకు పోనియ్యకుండా అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలపై కోడిగుడ్లతో దాడి చేశారు. టీటీడీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసు లాఠీఛార్జ్ చేశారు.
ఇదిలా ఉంటే టీ ర్యాలీకి కోల్ కతా పోలీసులు నిరాకరించారు.దీంతో కోల్ కతా హైకోర్టు నుంచి అనుమతి పొందింది మమత బెనర్జీ. షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ర్యాలీపై బీజేపీ కార్యకర్తల దాడిని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు.దురుద్దేశంతోనే ర్యాలీని బీజేపీ అడ్డుకుందని మమత అరోపించారు.

