మయన్మార్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలభై ఆరు మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచిన గోదాములో పేలుడు జరగడంతో ఈ పెను ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను.
డెబ్బయి మందికి తీవ్ర గాయాలు…
ఈ ప్రమాదంలో డెబ్బయి మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన గోడౌన్లో పేలుడు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న నివాసాలన్నీదెబ్బతిన్నాయి.

