మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. గంగాపూర్ దగ్గర హైవేపై రైతుల ధర్నాకు దిగారు. అధికారులు వారి ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. దీనితో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడింది.
ధాన్యం కొనుగోలు చేయడం లేదని…
రైతులు తమ నిరసనలో భాగంగా వడ్ల బస్తాలను రోడ్డుపై వేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

