Vijayawada Road Incident: ఇటీవల విజయవాడ నగరంలో ఒక యువతీ విషయంపై ఇద్దరూ యువకులు మనస్పర్ధలు పడ్డారు. ఫలితంగా వారిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాలు పెరిగిపోయాయి. ఒకరి మీద మరొకరు పగ పెంచుకున్నారు. చివరికి అంతం చేసుకునే స్థాయి వరకు వెళ్లారు. గడచిన గురువారం రాత్రి హై టెన్షన్ రోడ్డులో అత్యంత దారుణంగా తమ వాహనాలతో ఢీకొట్టారు. అయితే ఈ ఘటనలో ఓం, రోహిత్ సాయి అనే వ్యక్తులు కలిసిపోయారు. ఇది కాస్త ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వారిద్దరినీ పట్టుకున్నారు. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇచ్చారు. తత్వం బోధపడిన ఆ ఇద్దరు.. అనంతరం పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత అహానికి వెళ్ళిపోయాం.. ఇరుక్కుపోయాం.. అనవసరంగా పరువు తీసుకున్నామని బాధపడ్డారు. చిన్నపాటి పరిస్థితిని సరిదిద్దుకొని ఉంటే ఇక్కడ వరకు వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. అమ్మాయి విషయంలో గొడవల వల్ల వీరిద్దరూ కొద్దిరోజులుగా మాట్లాడుకోవడం లేదు.. ఓం విశాఖపట్నంలో బీబీఏ పూర్తి చేశాడు. ఇతడి తండ్రికి జేజేఫ్రా ఇన్ రియల్ ఎస్టేట్ అనే కంపెనీ ఉంది. ఆ కంపెనీని హోమ్ చూసుకుంటున్నారు. ఇక లింగమనేని రోహిత్ సాయి అనే యువకుడు తాడేపల్లి ప్రాంతంలో బి ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఇతడి తండ్రికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది. ఈ ఘటన జరిగినప్పుడు రోహిత్ సాయి, ఓంతోపాటు వారి స్నేహితుడు కూడా ఉన్నారు. ఓం వెహికల్ లో మోహిత్, సిద్ధార్థ అనే యువకులను ఎక్కించుకున్నాడు. నేరుగా హెచ్డి లైన్ రోడ్లోకి వచ్చాడు. రోహిత్ గూడ తనకు అత్యంత సన్నిహితుడైన మహమ్మద్ అఫాన్ ను అనయకుడిని ఎక్కించుకున్నాడు. వీరిద్దరూ పరస్పరం ఢీకొట్టుకున్నారు. ఆ సమయంలో స్నేహితుల ప్రమేయం లేదని పోలీసుల విచారణలో తేలింది.
అనంతరం జరిగిన పరీక్ష ఇద్దరి రక్తనమునాలను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఏమైనా మత్తు పదార్థాలు తీసుకున్నారా.. అనే అంశంపై పోలీసులు కూపిలగారు. ఇందులో ఓం మత్తు పదార్ధాలు తీసుకున్నట్టు తేలింది. రోహిత్ సాయి విషయంలో మాత్రం ఎటువంటి సానుకూల ఫలితం రాలేదు.. అనంతరం భూమి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అందులో శక్తికి ఉపయోగించే మాటలు.. ఇతర చూర్ణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వాహనాలు కూడా హాకీ కర్రలు.. ఇనుప రాడ్లు కనిపించాయి.. అయితే రోహిత్ సాయి సహనం కోల్పోయి కొండలరావు అనే వ్యక్తిని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. అతడికి ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు సాక్ష్యంగా తీసుకున్నారు. అయితే వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది.

