Revanth Reddy Political Journey: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రస్థానం చాలా భిన్నమైనది. పొలిటికల్ గా ఆయనకు ఎటువంటి నేపథ్యం లేనప్పటికీ ఈ స్థాయి వరకు వచ్చారు. ఆర్ఎస్ఎస్.. తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ పార్టీ.. ఇలా రకరకాల నేపథ్యాలను ఆయన తన రాజకీయ ప్రయాణానికి అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి ప్రయాణంలోనూ ఎంతో కొంత నేర్చుకున్నారు. తనను తాను గొప్పగా తీర్చిదిద్దుకున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయ్యాయి.
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రయాణంలో తొలి అడుగులు ఉమ్మడి పాలమూరు జిల్లా మిడ్జిల్ జెడ్పిటిసి సభ్యుడిగా మొదలుపెట్టారు. 20 సంవత్సరాల క్రితం ఆయన వేసిన అడుగు బలమై.. బలోపేతమై.. చివరికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది.
విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేశారు రేవంత్ రెడ్డి. 2000 ఆరు సంవత్సరంలో జరిగిన జెడ్పీ ఎన్నికల్లో మిడ్జిల్ స్థానానికి ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. జూలై 4న ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత మరసటి ఏడాది 2007 లో ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డారు. శాసనమండలిలో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. తనకు ఉన్న వాక్పాటితో పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు.
2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజనకు గురి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కార్యనిర్వహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. తెలంగాణ శాసనసభలో టిడిపి ఎల్పీ బిఆర్ ఎస్ ఎల్ పి. లో విలీనం అయింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారింది.
టిడిపికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో కూడా పట్టు సాధించారు. కాంగ్రెస్ పార్టీని మరింత చేరువ చేయగలిగారు. కెసిఆర్ కు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగారు. అది ఆయనను బలంగా నిలిపింది. 2018 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం లో ఓడిపోయినప్పటికీ.. ఆ మరుసటి ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద స్థానమైన మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2021లో పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఆయనది డిసెంబర్ 7న తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. ముఖ్యమంత్రిగా ఎదిగారు.. రేవంత్ రెడ్డి జీవితంలో మిడ్జిల్ జడ్పీటీసీగా ఎన్నిక అవడం ఎప్పటికీ ప్రత్యేకతనే. దానిని గుర్తు చేసుకుంటూ రేవంత్ రెడ్డి నేడు మిడ్జిల్లో పర్యటిస్తున్నారు. ఆయన అభిమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

