హనీమూన్ కోచ్ : మీరు ఇండోనేషియాలోని బాలీ వెళ్లారా.. లేదా మనదేశంలో ఉన్న కేరళ రాష్ట్రానికి వెళ్లారా.. ఇక్కడ కొత్త జంటల కోసం హనీమూన్ ప్యాకేజీలు ఉంటాయి. ఈ భాగంగా హనీమూన్ వారి జీవితంలో గొప్ప జ్ఞాపకం లాగా ఉండిపోవాలని నిర్వాహకులు రకరకాలుగా ఏర్పాటు చేస్తారు. సముద్రాన్ని ఆస్వాదిస్తూ.. నీటి మీద ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన హ్యాట్స్లో నూతన దంపతులు ఏకాతాన్ని ఆస్వాదించే విధంగా అక్కడ వాతావరణాన్ని కల్పిస్తారు. అందువల్లే నూతన దంపతులు హనీమూన్ కోసం బాలి లేదా కేరళ వెళ్తూ ఉంటారు.
రోజురోజుకు పర్యాటకం మీద ప్రభుత్వాలు దృష్టిపెడుతున్న నేపథ్యంలో కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే పర్యాటకంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. అందులో కాలుష్యం కూడా ఉండదు. కేవలం పర్యాటకులను ఆకర్షించే విధంగా రకరకాల మార్పులను.. కొత్తకొత్త విధానాలను రూపొందించినట్లయితే సరిపోతుంది. సరిగ్గా ఇదే విధానాలను మన భారతీయ రైల్వే శాఖ అమలు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు రకరకాల ప్రణాళికలను తెరమీదకు తీసుకొచ్చింది. ముఖ్యంగా నూతన జంటలకు అనుకూలంగా సరికొత్త ప్యాకేజీలను అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలు ఎలా ఉన్నాయంటే…. విదేశాలు కాదు ఇండియాలోనే ఏకాంతాన్ని గడిపే విధంగా..
తాజాగా రైల్వే శాఖ హనీమూన్ కపుల్స్ కోసం ఒక ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ ప్యాకేజీ ప్రకారం రైల్లోనే హనీమూన్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా పడక గదులను సిద్ధం చేసింది. దానిమీద లవ్ సింబల్ లో రేకులను పరిచింది. బెలూన్లు ఏర్పాటు చేసింది. ఐ లవ్ యు అనే నేపథ్యంతో దీనిని రూపొందించారు.. శుభ్రతకు.. స్వచ్ఛతకు కేరాఫ్ అడ్రస్ లాగా దీనిని రూపొందించారు. హనీమూన్ కపుల్స్ ఇటువంటి వెదర్ చూడగానే వెంటనే ఇక్కడ గడిపేయాలన్నట్టుగా ఇండియన్ రైల్వే శాఖ మార్చింది. ఈ ఫోటోలు.. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ప్యాకేజీలు ఇండియన్ రైల్వే శాఖ మరిన్ని అమలు చేస్తే కపుల్స్ రెచ్చిపోతారని.. విహారయాత్ర ప్రాంతాల్లో కాకుండా రైళ్లలోనే హనీమూన్ చేసుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

