లయన్స్ క్లబ్ | ఏకగ్రీవంగా ఎనికైన తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది.
తాండూరు : ఏకగ్రీవంగా ఎనికైన తాండూర్ తెలంగాణ లయన్స్ క్లబ్ (తాండూరు లయన్స్ క్లబ్) నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ లయన్ రిక్కల నారాయణరెడ్డి అధ్యక్షుడిగా ఠాకూర్ ఉమ్రావ్ సింగ్ (ఉమ్రావ్ సింగ్) , కార్యదర్శిగా తాటిపాముల సాంబమూర్తి, కోశాధికారిగా గందె రాజన్న, ఉపాధ్యక్షుడిగా మద్దికుంట రామచందర్‌తో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ తాండూర్ తెలంగాణ క్లబ్ గత 11 సంవత్సరాలుగా ఉచిత పరీక్ష, రక్తదాన, మధుమేహ పరీక్ష శిబిరాలను నిర్వహించడమే కాకుండా దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయడం ద్వారా అపన్నులకు నిర్విరామంగా సేవలందిస్తుందని కొనియాడారు. నూతన అధ్యక్షుడు ఉమ్రావ్ సింగ్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ క్యాలెండర్ ప్రకారం అన్ని కార్యక్రమాలు చేపడతామని అవసరమైన వారికి అన్ని విధాల సేవలందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రీజియన్ కోఆర్డినేటర్ దుద్దిళ్ల నారాయణరావు, రీజియన్ చైర్పర్సన్ బొమ్మ బాపురెడ్డి, జోనల్ చైర్పర్సన్ అన్నం రమేష్, మాజీ అధ్యక్షుడు, కార్యదర్శులు దేవరకొండ రాజయ్య, బాలప్రసాద్ మారు, మాజీ జోనల్ చైర్ పర్సన్ రౌతు వెంకటేశం, తాండూర్ తెలంగాణ క్లబ్ సభ్యులు ఉన్నారు.

