విశాఖపట్నం: పెందు-ఆనందపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఒక మహిళతో సహా నలుగురు మృతి చెందారు. వేగంగా వెళ్తున్న కారు ముందున్న లారీని ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ…చికిత్స నిమిత్తం ఆసుపత్రికి చికిత్స. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లకు చెందిన నలుగురు, నరసరావుపేటకు చెందిన కారు డ్రైవర్ శ్రీను…శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ విశాఖపట్నం జిల్లా ఆనందపురం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు ఓవర్టేక్ చేయబోయి లారీని డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న పాలగాని రామాంజినేయులు(51), షేక్ మీరావలి(56), మందపాటి భవానీశంకర్ (11), డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మందపాటి చంద్రశేఖర్ భీమిలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రశేఖర్ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అమూల్య నర్సింగ్ హోమ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారంహోం మంత్రి అనిత దిగ్భ్రాంతి…
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విశాఖ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుడు చంద్రశేఖర్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను తీసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
పోస్ట్ లారీని ఢీకొన్న కారు…నలుగురు మృతి మొదట కనిపించింది విశాలాంధ్ర.

