లెనిన్: అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ విడుదలకు ముందే బిజినెస్ పరంగా మంచి జోరు చూపిస్తోంది. ప్రస్తుతం మిడ్‌రేంజ్ సినిమాలకు ఓటీ ఒప్పందాలు కుదుర్చుకోవడమే సవాలుగా మారిన పరిస్థితుల్లో, ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏకంగా రూ.34 కోట్లు రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే ‘లెనిన్’ ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ సంస్థ రూ.19 కోట్లకు సొంతం చేసుకుంది. అదే సమయంలో హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో రూ.9 కోట్లు నిర్మాతలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ రూ.6 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ మూడు విభాగాల ద్వారా ‘లెనిన్’కు రూ.34 కోట్ల నాన్ థియేకల్ బిజినెస్ జరిగింది అటు సోషల్ మీడియాలో ఇటు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం.
ఇటీవలి కాలంలో మధ్యస్థాయి బడ్జెట్ చిత్రాలకు ఓటీటీ డీల్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం, శాటిలైట్ మార్కెట్ కూడా గతంతో పోలిస్తే మందగించడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటి సమయంలో ‘లెనిన్’కు ఈ స్థాయి బిజినెస్ జరగడం చిత్రబృందానికి పెద్ద ప్లస్‌గా ఉంది. ముఖ్యంగా సినిమా విడుదలకు ముందే పెట్టుబడిలో భాగం రికవరీ కావడం నిర్మాతలకు ఊరటనిచ్చే అంశంగా మారింది. ఈ అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలసి ఉన్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలకు ఉన్న బ్రాండ్ వాల్యూ కూడా బిజినెస్‌పై సానుకూల ప్రభావం చూపినట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అఖిల్ అక్కినేని కెరీర్లో ఈ సినిమా మారనున్న నేపథ్యంలో జులై 10న విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కీలక ఫలితాన్ని ఇస్తుందన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. ఈ బిజినెస్‌కు తగ్గట్టుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

