ఉత్తర ప్రదేశ్లో హమీర్పూర్ జిల్లాలో తీవ్ర విషాదం. బెత్వా నదిపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
గాయపడిన వారిలో…
తీవ్ర గాయాలపాలైన వారిని వెంటనే ఆసుపత్రి వద్దకు తరలించి చికిత్స అందించారు. వీరిలో కొందరి ప్రమాదకరంగా ఉందని, ఇప్పుడే పరిస్థితి ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. కురారా పోలీస్ స్టేషన్ పరిధి కందౌర్-మొరకందర్ బ్రిడ్జి వద్ద ప్రమాదం జరిగింది. వంతెన కూలిపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

