తెలంగాణ:మెదక్ జిల్లా సర్ధనగేట్-బూరుగుపల్లి ( Sardhanagate-Burugupalli )ప్రధాన రహదారిపై విద్యుత్ శాఖ,అటవీ శాఖ(విద్యుత్ శాఖ, అటవీ శాఖ) సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది.కరెంట్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది పనులు చేపట్టారు.
అయితే, తమ శాఖ అనుమతి లేకుండా చెట్లను ఎలా తొలగిస్తారని శాఖ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ పనులను అడ్డుకున్నారు.
ఇరు వర్గాల ఉద్యోగులు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం తోపులాట, దాడులకు దిగారు.ఈ ఘటన అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు తెలిసింది.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా,శాఖల మధ్య సమన్వయ లోపమే ఈ వివాదానికి కారణమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

