వైరల్ కుంభమేళా ఉమెన్ మోనాలిసా వివాహం వివాదంలో ఊహించని ట్విస్ట్ జరిగింది. ఆమెకు రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులను కేరళ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది.జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అసలు విషయం ఏంటంటే.. మోనాలిసా తన పిటిషన్లో ఇచ్చిన ఫోన్ నంబర్, అడ్రస్ ఆధారంగా ఆమెను సంప్రదించడానికి పోలీసులు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ఆచూకీ కనిపెట్టడం సాధ్యం కావడం లేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపింది. గతంలో కూడా ఇలాగే కోర్టు రక్షణ కల్పించమన్నా.. ఆమె పోలీసులకు దొరకకుండా పోవడం అలవాటుగా మారిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇంకా చదవండి: సుప్రీంకోర్టులో హైడ్రామా: జడ్జీలపై పేపర్లు విసిరి.. సీజేఐపై దురుసుగా ప్రవర్తించిన పిటిషనర్
ఆమె అడ్రస్ లేనప్పుడు టెక్షన్ ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదని పోలీసులు ప్రాక్టికల్ ఇబ్బందులను వివరించారు. ప్రస్తుతం తన క్లయింట్ నుండి ఎలాంటి సమాచారం లేదని కోర్టుకు మోనాలిసా తరపు లాయర్ సూచన.
దీంతో కోర్టు జూన్ 19న ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్‌ను కొట్టేసింది. అయితే ఒకవేళ ఆ మహిళ నేరుగా పోలీసులను లిఖితపూర్వకంగా ఆశ్రయించి రక్షణ కోరితే చట్టప్రకారం ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది కోర్టు.

