ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అద్వర్యం లో ఉన్నటువంటి పంచాయితీ రాజ్ శాఖకు దేశవ్యాప్తంగా ఎలాంటి ఖ్యాతి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో జాతీయ పురస్కారాలు ఈ శాఖకు సొంతం అయ్యాయి. దేశ చరిత్ర లోనే ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అభివృద్ధి ని చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా రోడ్ల విషయం లో పవన్ కళ్యాణ్ తన అధికార యంత్రాంగాన్ని ఏ రేంజ్ లో పరుగులు తీయించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్రామాల్లో అద్దాలు లాంటి రోడ్లను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతే కాకుండా క్వాలిటీ విషయం లో పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీపడలేదు. స్వయంగా ఆయన ఆకస్మిక తనిఖీలు కూడా జరిగాయి. లేకపోతే లేటెస్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా సర్వే జరిగింది.
ఈ సర్వేలో అన్ని గ్రామాల్లోనూ రోడ్ల నాణ్యతను పరిశీలించారు. నాణ్యత విషయంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, మన ఆంధ్ర ప్రదేశ్ రెండవ స్థానం లో ఉంది. వైసీపీ హయాం లో ఇదే సర్వే నిర్వహించగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 19వ స్థానంలో నిలిచింది. ఆ స్థాయి ర్యాంకు నుండి ఈ రేంజ్ కి ఎగబాకడం అనేది సాధారణమైన విషయం కాదు. రాబోయే రోజుల్లో ఈ శాఖ ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సాధిస్తున్న ఈ విజయాలను చూసి , ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆయన ఇన్ని అద్భుతాలను సృష్టిస్తున్నారు , ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల్లో ఓజీ నే , నూ ఓజీ నే, ఆయనకు సాటి మరెవ్వరు లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ గ్రామీణాభివృద్ధి , రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రేంజ్ ఫలితాలు రాబోతుందో చూడాలి. ఈ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లో రాబోతున్నాయని పవన్ కళ్యాణ్ నిన్న తన ఎమ్మెల్యేలు , ఎంపీల సమావేశంలో చెప్పుకొచ్చారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ రేపు తన రెండు భుజాలకు సర్జరీ చేయించుకోవడం కోసం ముంబై కి వెళ్లనున్నారు. అనంతరం ఆయన కొన్ని వారాలు విశ్రాంతి తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారు.

