మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ రాక్షస పాలన విముక్తికి రెండేళ్లు పూర్తయిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గొడ్డలి పార్టీ రాజకీయాలకు 2024లో ప్రజలు చరమగీతం పాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ది ఏమీ లేదని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా వెనకబడేలా చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
జగన్ పాలనలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్న మంత్రి అచ్చెన్న వైసీపీ నిరసనలు ప్రజల తీర్పును అవమానించే చర్య అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కిన పార్టీ వైసీపీ అని, గత హయాంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, భూకబ్జాలతోనే పాలన సాగిందని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే వైసీపీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి కల్పించేలా తీర్పు చెప్పారని అన్నారు.

