ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసనల్లో హింస తలెత్తడంతో పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుగ్ యువతకు, విద్యార్థులకు ఓ మేసేజ్ చేశారు. శాంతియుతంగా నిరసనల్లో పాల్గొనాలని. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడం తనను బాధించాయని వాంగ్ చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. బయటినుంచి వచ్చిన వారు రెచ్చగొడతారు.. విద్యార్థులు, యువత సంయమనం పాటించాలని వాంగ్ చుక్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో అహింసా మార్గాన్ని విడిచిపెట్టొదని సోనమ్ వాంగ్ చుక్ నిరసన కారులకు సూచించారు.
గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం X ద్వారా వాంగ్ చుక్ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ”శాంతి.. శాంతియే నామార్గం.. జంతర్ మంతర్ లో జరుగుతున్న నిరసనలు శాంతి యుతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇతర వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు ఈ శాంతియుత నిరసనలకు అవకాశంగా తీసుకుని హింసను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

