– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్ : నటుడు శోభన్ బాబు సతీమణి శాంతకుమారి (86) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. శుక్రవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించే కుటుంబ సభ్యులు ఉన్నారు. కాగా, 1958 మే 15న శోభన్ బాబుతో శాంతకుమారికి పెళ్లి జరిగింది. 2008లో శోభన్ బాబు గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.
– ప్రకటన –

