షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభించిన పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఘటన జరిగి 48 గంటలు దాటినా అతనికి జాడ దొరకడం రాష్ట్రవ్యాప్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగానే నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు.
ప్రస్తుత 12 నుంచి 14 వరకు ప్రత్యేక పోలీసు బృందాలు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ విశ్లేషణ, మొబైల్ సిగ్నల్ లొకేషన్, రూట్ ట్రాకింగ్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వంటి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నాయి. బెంగళూరు, ముంబై, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. హత్యల అనంతరం రాజ్‌కుమార్ రైల్వే ట్రాక్‌పై నిలబడి, రైలు ఎదురుగా వస్తుండగా చివరి క్షణంలో పక్కకు తప్పుకున్న దృశ్యాలు సీసీవీలో నమోదైనట్లు సమాచారం. దీంతో అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా? లేక పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నాటకం ఆడడా? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు.
తిమ్మాపూర్ నుంచి నందిగామ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ నుంచి రాజ్‌కుమార్ ఏదైనా రైలు ఎక్కాడా.? ఎక్కి ఉంటే ఏ రైలులో వెళ్లాడు.? అనే అంశంపై దృష్టి సారించారు. నందిగామతో పాటు ఆయా రైల్వే స్టేషన్ల సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రాజ్‌కుమార్ పక్కా ప్రణాళికతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హత్యలకు ఉపయోగించిన కత్తిని ముందుగానే కొనుగోలు చేసి ఇంట్లో దాచిపెట్టినట్లు. కత్తిపై తుప్పు ఉండటంతో ఇది ముందే కొనుగోలు చేసిన ఆయుధమని అధికారులు అనుమానిస్తున్నారు.
హత్యకు ముందు రాజ్‌కుమార్ వద్ద నాలుగు మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే హత్య అనంతరం రాత్రి 11:50 గంటలకు అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అప్పటి నుంచి ఒక్క సిమ్ కూడా వినియోగించుకున్న పోలీసులు టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అవకాశం ఉందని భావించి అన్ని నంబర్లపై నిఘా ఉంచారు. రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోలేదని.. రాష్ట్రం దాటి బెంగళూరు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడికి శ్రీశైలం వెళ్లే అలవాటు ఉండటంతో అక్కడ కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. బెంగళూరు హైవేతో పాటు హోటళ్లు, లాడ్జీలు, దాబాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. మరోవైపు కేసు పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపణలతో షాబాద్ ఎస్ఐ రమేష్‌ను సస్పెండ్ చేయగా.. సీఐ కాంతారెడ్డికి చార్జ్ మెమో జారీ చేశారు. ప్రస్తుతం షాబాద్ పోలీసులను దర్యాప్తు నుంచి తప్పించి, ఎస్‌వోటీతో పాటు ఇతర ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో సీపీ తరుణ్ జోషి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

