ఆంధ్రప్రదేశ్:తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ ( కోటగుమ్మం సెంటర్ )సమీపంలోని ఓ వస్త్ర దుకాణంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దుకాణంలో రెండు అంతస్తులకు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు.అప్పటికే దుకాణంలో నిల్వ ఉంచిన పెద్ద మొత్తంలో వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.అయితే సుమారు రూ.70 లక్షల మేర ఆస్తినష్టం సంభవించినట్లు దుకాణ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

