శుభ్మాన్ గిల్: సచిన్ కుమార్తె సారా తో టీం ఇండియా, టెస్ట్ కెప్టెన్ గిల్.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిని గిల్ ఖండించలేదు. అలాగని సమర్థించలేదు. ఆ మధ్య లండన్లో ఉన్నప్పుడు సచిన్ తన కుటుంబంతో సహా హాజరయ్యాడు. అప్పుడు గిల్ కూడా జట్టు సభ్యులతో కలిసి వచ్చాడు. నాడు బౌలర్ రవీంద్ర జడేజా సారాను చూపిస్తూ గిల్ ను ఆట పట్టించాడు. దీంతో అప్పుడే అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇటీవల సచిన్ కుమారుడు అర్జున్ వివాహం చేసుకున్నాడు. ఇక మిగిలింది సారానే. సారా ముంబైలో వ్యాపారం చేస్తోంది.. సోషల్ మీడియాలో తన అప్డేట్లు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం గిల్ లండన్ లో ఉన్నాడు. అక్కడ వింబుల్డన్ టోర్నీ చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడుల్ బాక్సులో కూర్చొని వింబుల్డన్ పోటీని వీక్షించాడు. సూటు బూటు ధరించిన అతడు సెంటర్ కోర్టులో అట్రాక్షన్ గా కనిపించాడు. వింబుల్డన్ రాయల్ గా కనిపించిన అతడు సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఆహ్వానం అందుకుంది టీమ్ ఇండియా నాలుగో సారధిగా అతడు నిలిచాడు. ఈ జాబితాలో సచిన్.. విరాట్ కోహ్లీ. రోహిత్ ఉన్నారు. ఇప్పుడు గిల్ ఆ జాబితాలో చేరాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లను సచిన్ సైతం రాయల్ బాక్స్ లో కూర్చుని వీక్షిస్తున్నాడు. గిల్ కు ఏకంగా రాయల్ బాక్స్ స్వాగతం లభించడంతో.. సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చ నడుస్తోంది. సచిన్ దారిలోనే గిల్ నడుస్తున్నాడని.. తెరవెనుక ప్లాన్ గట్టిగానే రూపొందించాడని ప్రచారం సాగుతోంది. రాయల్ బాక్స్ లో సచిన్,అంజలితో కలిసి మ్యాచ్ చూశాడు. ఇది కాకతాళీయమా..లేక ఇంకా ఏమైనా ప్లాన్ ఉందా..
గిల్ ఆట తీరు చూసేందుకు గతంలో సారా అనేక పర్యాయాలు మైదానాలకు వచ్చింది. ఆ సమయంలో మీడియా ఫోకస్ మొత్తం కూడా సారా మీదనే ఉంది. సారా కూడా ఆ సమయాన్ని ఆస్వాదించింది. అప్పట్లో ముంబైలో గిల్.. సార దొంగచాటుగా కలుసుకున్నారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అయితే అటు గిల్.. ఇటు సారా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. దానిని ఖండించలేదు. అంటే వీరిద్దరూ తమ వ్యవహారాన్ని సాగిస్తున్నారని.. సమయం దొరికినప్పుడు బయట పెడతారని కొందరు ఉండగా.. మరి కొందరు అలాంటి రహస్యాలు ఏవీ లేవని.. అదంతా కూడా మీడియా సృష్టినని మరి కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గిల్ ప్రస్తావన వచ్చినప్పుడు.. కచ్చితంగా మీడియా సారాకు లింక్ పెడుతుంది. రకరకాల కథనాలను వండి వారిస్తూ ఉంటుంది. నేటి కాలంలో సీరియస్ విషయాలకంటే మసాలా వంటకాలకు ప్రాధాన్యత ఎక్కువ. ఇది కూడా మసాలా వంటకం కాబట్టి.. జనాలు ఏమీ చేయలేకపోయారు. ఏదో ఉందనుకొని.

