రామాలయ విరాళాల లెక్కింపు సిబ్బంది వరుస రాజీనామాలు
అయోధ్య: రామాలయ విరాళాల చోరీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. వీహెచ్‌పీ, బీజేపీలో అంతర్గత ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే ట్రస్ట్ కార్యదర్శి పదవికి చంపత్ రాయ్, ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై ఓ పక్క సిట్ దర్యాప్తు జరుపుతోంది. ప్రధాన నిందితుడు అవినాశ్ శుక్లాతో పాటు మరి కొంతమంది నిందుతులను అరెస్ట్ చేశారు. నిందుతుల ఇళ్లల్లో సోదాలు జరిపి అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనితో లెక్కింపు సిబ్బందిలో గుబులు రేగుతోంది. భయంతో సిబ్బందిలో సగానికిపైగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం లెక్కింపు సిబ్బంది సంఖ్య 12కు తగ్గింది. విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం. విచారణ అనంతరం 40 మంది సిబ్బందిలో 15 నుంచి 20 మంది మాత్రమే విధులకు హాజరయ్యేవారని, ఇప్పుడు వారిలోనూ కొందరు రాజీనామా చేశారని ట్రస్టు అధికారులు వెల్లడించారు. మొత్తం సిబ్బందిలో 20 మందిపైగా రాజీనామా చేశారు. దీంతో లెక్కింపు ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోంది. లెక్కింపు కేంద్రం వద్ద నిఘాను మరింత కట్టుదిట్టం చేసి రాజీనామా చేసిన వారి సంఖ్య పెరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఉద్యోగులను లోపలికి అనుమతించే ముందు పలు దఫాలు వారిని తనిఖీ చేస్తున్నారు. అంతకుముందు ప్రవేశానికి ఎటువంటి తనిఖీలు చేయకుండా కేవలం ట్రస్టు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉంటే.
13న సుప్రీంకోర్టు విచారణ…
అన్ని రాజకీయ పార్టీలు న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయోధ్య విరాళాల చోరీపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనుంది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం వెళ్లనుంది.
పోస్ట్ హుండీ లెక్కింపు ఉద్యోగుల్లో గుబులు మొదట కనిపించింది విశాలాంధ్ర.

