ఈ సంవత్సరం ఫిబ్రవరి 28 నుండి ఆరంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తివం తమ దేశాలు ఇరాన్‌ను చాలానే నష్టపరచగలిగాయి యి గాని లొంగదీయలేకపోవడాన్ని ప్రపంచం గమనించింది. ఇరాన్ వీరోచిత పోరాటానికి, మనోబలానికి, అక్కడి ప్రజల అచంచలమైన ఐక్యతకు, దేశభక్తికి అబ్బురపడి చప్పట్లు చరిచింది. ఇరాన్యాన్ని సైన్యం, వైమానికి, నౌకాబలాలను, క్షిపణి శక్తులను 80 నుంచి 90 శాతం ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు సగర్వంగా పదే పదే చేసిన ప్రకటనలలో వాస్తవం లేదని కూడా ఇరాన్ ఎదురు దాడి తీవ్రతతో ప్రపంచానికి అర్థమైంది. అదే విధంగా అమెరికా, ఇజ్రాయెల్‌లకు కూడా.
జులై 7 వరకు చమురు, గ్యాస్ రవాణా ధరలు తగ్గుతూ రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఆ పరిస్థితి ఇక దీర్ఘకాలికం కాగలదని, యుద్ధ సమస్య క్రమంగా పరిష్కారమవుతుందని ఆశించింది. కానీ మరునాడు 8వ తేదీకి అంతా నాటకీయంగా తిరగబడింది. అమెరికా ఇరాన్‌ల మధ్య తిరిగి పరస్పర దాడులు మొదలై సాగుతున్నాయి. వెంటనే ఇంధన ధరలు పెరగడం, స్టాక్ మార్కెట్లు అధోముఖం పట్టాయి.
ఎందుకీ నాటకమైన మార్పు? వాస్తవానికి గత నెల 17న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం 60 రోజుల తర్వాత ఈ 20 రోజులలోనూ రెండు సార్లు పరస్పర దాడులు జరిగాయి. కానీ అవి చెదురుమదురు ప్రస్తుతం. ఇంతలో జరిగి అంతలో ఆగాయి. ఈసారి అట్లా కనిపించటం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టర్కీ రాజధాని అంకారాలో నాటో సైనిక కూటమి సమావేశాల సందర్భంగా ప్రకటించినట్లు, ‘కాల్పుల విరమణ ఇక ముగిసిపోయినట్లే’నా? యుద్ధం పూర్తిస్థాయికి తిరిగి చేరవచ్చునా? పాకిస్తాన్, ఖతార్‌ల మధ్యవర్తిత్వం ముగిసిపోయినట్లా? ఇరాన్‌పై దాడులకు వారి ప్రతీకార దాడులతో తీవ్రంగా నష్టపోతున్న సౌదీ అరేబియా, యుఇఇ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ ఇక వారిని ససేమిరా అంటారా?
ఈ దశలో అన్ని ముఖ్యమైన ప్రశ్నలు. కానీ సమాధానం వాటికి చెప్పటం బహుశా ఎవరికీ సాధ్యం కాదు. అమెరికా అధ్యక్షునికి కూడా. ఆయన సైతం ‘కల్పుల విరమణ ఇక ముగిసిపోయినట్లే’ అన్నారు గాని ‘ముగిసిపోయింది’ అని స్పష్టంగా ప్రకటించలేదు. చర్చల నుంచి ఉపసంహరించుకుంటున్నామని కూడా చెప్పలేదు. ఇరాన్ వైపు చూస్తే, దాడులకు, కాల్పుల విరమణ ఉల్లంఘనకు అమెరికా ‘భారీ మూల్యం’ అని, గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై ‘తీవ్రమైన దాడులు జరపగల’మని హెచ్చరించారే తప్ప, ఇక చర్చలు జరగబోవడం లేదు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ వంటి శక్తివంతమైన దేశాలు ఇరాన్‌ను చాలానే నష్టపరచగలిగాయి గాని లొంగదీయలేకపోవడాన్ని ప్రపంచం గమనించింది. ఇరాన్ వీరోచిత పోరాటానికి, మనోబలానికి, అక్కడి ప్రజల అచంచలమైన ఐక్యతకు, దేశభక్తికి అబ్బురపడి చప్పట్లు చరిచింది. ఇరాన్యాన్ని సైన్యం, వైమానికి, నౌకాబలాలను, క్షిపణి శక్తులను 80 నుంచి 90 శాతం ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు సగర్వంగా పదే పదే చేసిన ప్రకటనలలో వాస్తవం లేదని కూడా ఇరాన్ ఎదురు దాడి తీవ్రతతో ప్రపంచానికి అర్థమైంది. అదే విధంగా అమెరికా, ఇజ్రాయెల్‌లకు కూడా. పాశ్చాత్య దేశాలకు చెందిన స్వతంత్ర నిపుణుల అంచనాలను బట్టి, ఇరాన్ క్షిపణుల సంఖ్య ఇప్పటికీ 75 శాతం వరకు మిగిలే ఉంది. డ్రోన్ల మాట చెప్పనక్కర లేదు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వంటి శక్తికే డ్రోన్లను అపరిమితంగా సరఫరా చేసిన ఇరాన్‌కు, వాటి ఉత్పత్తి ఏర్పాట్లు అపారంగా ఉన్నాయి. ఇది చెప్పుకోవటం ఎందుకంటే, ఇరాన్ ఆయుధ సంపత్తితోపాటు అసమతల యుద్ధ సైనిక వ్యూహాలు ఎంత ప్రభావవంతమైనవో నెలల తరబడి సాగిన యుద్ధంలో బోధపడినందువల్లనే అమెరికా కాల్పుల విరమణ ఒప్పందానికి దిగి వచ్చింది. ఈ పరిస్థితులు ఇపుడు జులై 8న ట్రంప్ తిరిగి మొదలుపెట్టిన దాడులతో మారబోవటం లేదు. కనుక చర్చలు తప్పవని భావించాలి.
ఇరాన్ వైపు నుంచి చూసినప్పుడు, అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు దుర్మార్గమైన ఆర్థిక ఆంక్షల వల్ల వారు విస్తారమైన ఇంధన నిక్షేపాలు ఉండి కూడా 1979లో షా వంశాన్ని కూలదోసి ఇస్లామిక్ విప్లవాన్ని తెచ్చుకున్నప్పటి నుంచి బాధపడుతున్నారు. అట్లా 46 సంవత్సరాల ఆర్థిక ఆంక్షలకు తోడు ఇపుడు పూర్తి నిర్హేతుకమైన యుద్ధం వచ్చిపడి నష్టాలను తీవ్రంగా మార్చింది. ఆ పరిస్థితి నుంచి కోలుకోవటం వారికి కూడా ఎంత అవసరమో చెప్పనక్కర్లేదు. అందువల్లనే ఇరాన్ ప్రభుత్వం, ప్రజలు ఏకమై యుద్ధాన్ని ప్రతిఘటిస్తూనే, చర్చలు కూడా అవసరమని భావించారు. ఇప్పుడు జులై 8 నుంచి ముంచుకొచ్చిన కొత్త పరిస్థితిలోనూ సరిగా అదే వైఖరిని కొనసాగించవచ్చు. దాడులను ప్రతిఘటించటం, చర్చలకు మూయకపోవటం.
ఈ స్థితిలో తిరిగి మధ్యవర్తులైన పాకిస్థాన్, ఖతార్లపైన, ఇరాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గల్ఫ్ రాజ్యాలపై పడుతున్నది. దీనికి సంబంధించి రాగల కొద్ది రోజులలో గమనించవలసినవి రెండున్నాయి. ప్రస్తుత దాడి, ప్రతిదాడులు ఏ విధంగా సాగవచ్చునన్నది ఒకటి. పైన పేర్కొన్న దేశాలు తెర వెనుక తీసుకోగల చొరవల ఏమిటన్నది రెండు. ఇది తేలటం ఇజ్రాయెల్‌కు ఇష్టం లేదు గాని, తేలకపోవటం వల్ల ట్రంప్‌కు ఎదురవగల సమస్యలున్నాయి. ఇరాన్‌పై సాగిస్తున్న నిష్కారణ యుద్ధానికి అమెరికన్ ప్రజలలో, స్వయంగా ట్రంప్ ఓటర్లలో మద్దతు తగ్గుతోంది. అమెరికాలోనే చమురు నిల్వలు పుష్కలంగా కనిపిస్తున్న అధ్యక్షుడు ఎంతచాటి చెప్పుకుంటున్నా వాటితోపాటు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ సెనెటర్లనుంచి విమర్శలు మొదలయ్యాయి. వీటన్నింటికి మించిన ప్రమాదం నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తుండటం. జూన్ 17 కాల్పుల విరమణ ఒప్పందం వెనుక కూడా ఈ పరిస్థితుల ఒత్తిడి అమెరికా మీడియా సైతం రాసింది. దీనంతటితోనే ఆ రోజులలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ కొన్ని సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యాన్ని పరిగణించినప్పుడు, ఈసారి కూడా ట్రంప్ కొద్ది రోజులకు మళ్లీ చర్చల సూచనలు చేస్తే ఆశ్చర్యపడనక్కర్లేదు.
అదే సమయంలో చర్చలకు గల చిక్కుముళ్లను విస్మరించలేము. అవి అమెరికా, ఇరాన్‌ల వ్యూహాలతో ముడిపడినటువంటివి. జూన్ 17 నాటి ఒప్పందంలోని 14 అంశాలలో అన్నింటికన్నా ముఖ్యమైనవి హర్మూజ్ జలసింధి, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హెజ్బుల్లా తదితర మిలిటెంట్ సంస్థలకు ఇరాన్ మద్దతు, ఇరాన్ అణు పరిశోధనలు. ఈ నాలుగింటిలో దేనికి దానిని చుట్టుకుని అనేక విషయాలున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్‌ల ప్రయోజనాలు, మరొక వైపు ఇరాన్‌వి. వీటిలో ఏ ఒక్కటీ తేలికైనది కాదు, సులభంగా తేలేది కాదు. ఒకవేళ హర్మూజ్ అంశం కొంత ఇచ్చిపుచ్చుకోవటం పద్ధతిలో తేలినా తక్కిన మూడు కాదు. అవి అటో ఇటో అన్నట్లు తెగతెంపులు కావలసింది. ఆ మూడింటి గురించిన చర్చలోకి వెళ్లలేము గాని, ఈ నెల 8 నుంచి మొదలైన దాడులకు తక్షణ కారణం హర్మూజ్ వివాదం అయినందున ఆ విషయం విచారించబడింది.
ఇది ఇంత చిక్కుగా మారటం ఎందుకంటే, దాని వెంట గల ఇరువురి వ్యూహాలు కనిపిస్తున్నవే. భీకరమైన యుద్ధం సాగుతున్న స్థితిలో హర్మూజ్ మీదుగా ఇంధన వనరులు, ఇతర సరకులు రవాణా అన్నది ఇరాన్‌కు పెద్ద ఆయుధంగా వచ్చింది. నిజంగా ఈ మాట నిపుణులు పదే పదే చెప్పిందే, మీడియా పదేపదే చర్చిందే. ఆ రవాణాను అడ్డుకోవటం ప్రపంచానికి సమస్యలను సృష్టించినా, అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొనే అసమతల యుద్ధ వ్యూహంలో ఇరాన్‌కు బాగా కలిసి వచ్చింది. ఆ పని చేసి అమెరికాకు అడ్డుకట్ట వేయడానికి ఇరాన్‌కు ఆత్మరక్షణ మరింత కష్టమయ్యేదని అందరూ చెప్పిందే. ఆ విధంగా హర్మూజ్ ఒక ఆయుధంగా మారడంతో ఏ విధంగానైనా ఆ జలసంధిని ఇరాన్ పట్టు నుంచి బయటకు తేవాలన్నది అమెరికా వ్యూహం. ఆ పని చేయగలిగితే వారు రవాణాను అడ్డుకోలేరు కనుక ధరలపై, ప్రపంచ దేశాలపై, తమపై ఉన్న ఒత్తిడి లేకుండా పోతుంది. ఈ కోణానికి సంబంధించి ఇరాన్ నిరాయుధమవుతుంది. బలహీనపడుతుంది. మనం వింటున్న ఒక వ్యాఖ్య, ఇరాన్‌కు అణ్వాయుధం అంటూ లేదు గాని, హర్మూజ్‌పై నియంత్రణే అణ్వాయుధంగా పరిణమించిందని. దానిని బట్టి జలసంధిపై ఇరాన్ నియంత్రణను తొలగించటం అమెరికన్ వ్యూహకర్తలకు ఎంత కీలకంగా మారిందో ఊహించవచ్చు.
ఆ వ్యూహం అమలుకు అమెరికా రచించిన పథకం ఏమిటన్నది తర్వాత ప్రశ్న. హర్మూజ్ జలసంధిలోని తూర్పు తీరం ఇరాన్‌ను, పశ్చిమ తీరం ఒమాన్‌ను ఆనుకుని ఉంటాయి. ఇవి మంచి మిత్ర దేశాలు. జలసంధి ఫిబ్రవరి 28కి ముందు ఎవరి నియంత్రణ లేక స్వేచ్ఛా మార్గంగా ఉండేది. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ సృష్టించిన పరిస్థితితో దిగ్బంధానికి గురైంది. అప్పటి నుంచి ఇరాన్ ఆ ప్రాంతాన్ని ఇక శాశ్వతంగా నియంత్రణలోకి తీసుకోగలనని ప్రకటించారు. అది గాక, ఆ మార్గాన్ని ఒమాన్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించగలమని, నౌకలపై రుసుములు కాదు గాని, సర్వీస్ ఛార్జీలు(రవాణా సాఫీగా జరిగే ఏర్పాట్లు) విధించగలమని ప్రకటించారు. అందుకు ఒక దశలో పరోక్షంగా సుముఖత చూపిన ట్రంప్, తర్వాత దానితో సమస్య మొదలైంది.
ఇరాన్‌ను తొలగించడం, అమెరికా వ్యూహం కాగా, ఆ వ్యూహానికి విరుగుడు కనుగొనడం ఇరాన్‌కు అవసరంగా మారింది. జలసంధి ద్వారా నడిపే నౌకలు అసలు ఇరాన్ తీరం వైపు వెళ్లకుండా, ఒమాన్ తీరాన్ని ఆనుకుని మాత్రమే రాకపోకలు సాగించాలని అమెరికా సూచనలు చేసింది. ఈ నెల 8కి ముందు అట్లా వెళ్లజూసిన నౌకలపై ఇరాన్ కాల్పులు జరపగా, అమెరికాతో రెండు సార్లు స్వల్పంగా దాడి జరిగింది. కానీ జులై 8 వచ్చేసరికి అమెరికాకు పంతం పెరిగింది. తన వ్యూహాన్ని అమలు చేసి తీరాలని కోరుకుంటున్నది. ఆ వ్యూహానికి విరుగుడుగా ఇరాన్ చేస్తున్నదేమిటో కనిపిస్తున్నదే. తాము హర్మూజ్‌ను నియంత్రించి తీరగలమని, దానిని అమెరికా ఎట్టి పరిస్థితులలో నిరోధించగలదని ఇరాన్ రాజకీయ నాయకత్వం, సైనిక నాయకత్వం కూడా ప్రకటించింది. రెండు దేశాలు ఉన్న పరిస్థితులు ఏమిటో పైన చెప్పుకున్నవే. ఆ స్థితిలో ఈ కొత్త దాడులు ఎట్లా పరిణమించవచ్చునో వేచిచూడవలసిందే.
– టంకశాల అశోక్ (దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)

