తెలంగాణ:కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాల ముద్రణతోపాటు బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్వో)కు శిక్షణ ఇస్తారు. చేసింది.అయితే,ఇది ఓట్ల తొలగింపు కాదని,ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన మాత్రమే ఈసీ చెబుతోంది.25 నుంచి బీఎల్వోలు ఇంటింటి సర్వే నిర్వహించారు.దీని ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
అందులో పేర్లు లేకపోయినా.తప్పులు దొర్ల ఓటర్లు సవరణల కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సమయం ఇస్తారు.
ఫిర్యాదులపై విచారణ,పరిష్కార ప్రక్రియను సెప్టెంబరు 28న పూర్తిచేస్తారు.తుది ఓటరు జాబితాను అక్టోబరు 1న ప్రచురిస్తారు.
బీఎల్వోలు ప్రతి ఇంటిని సందర్శించి ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారికి ఎన్యుమరేషన్ ఫారాలను అందజేస్తారు.ఓటర్లు తమ పేరు,వయసు,కుటుంబ సభ్యుల వివరాలు,చిరునామా వంటి వాటిని పరిశీలించినట్లయితే అవసరమైతే సవరణలు సూచించవచ్చు.
ఇంటివద్ద ఎవరూ లేకపోతే బీఎల్వోలు కనీసం మూడుసార్లు ఇంటిని సందర్శించి వివరాలను సేకరించాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు.
బీఎల్వోలు వచ్చినప్పుడు ఓటరు అందుబాటులో లేకపోతే ము సాయిదా జాబితాలో ఆ ఓటరు పేరుపక్కన మార్క్ చేస్తారు.ఆగస్టులో వీరు ఆన్లైన్ ద్వారా లేదంటే.
నేరుగా తహసీల్దార్ ఫామ్-8 సమర్పించి తమ ఓటును భద్రపరుచుకోవచ్చు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు మ్యాపింగ్లో సుమారు 88.13 లక్షల ఓటర్ల వివరాల్లో అసమానతలు పేర్కొన్నారు.పేర్లు,వయసు,బంధుత్వం,డూప్లికేట్ల నమోదు,చిరునామా మార్పుల వంటి అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.వీటిని పరిశీలించి సరిచేస్తారు.2002లో జరిగిన సర్ళ్లలో నమోదైన కుటుంబ సభ్యుల వివరాలు. లేదు.ఒకవేళ సాఫ్ట్వేర్ తప్పుగా చూపించినా,ఓటరు వివరణ తీసుకున్న తర్వాత దానిపై నిర్ణయం ఉంటుంది.
ప్రజలేం చేయాలి.? సర్’ రికార్డు రికార్డు సమయంలో బీఎల్వోలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారాల్లో ప్రతి ఓటరు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.తప్పులుంటే సవరణ కోరవచ్చు.2002లో ఒక నియోజకవర్గంలో ప్రస్తుతం మరో నియోజకవర్గంలో నివసిస్తూ అక్కడే ఓటు ఉంటే సాఫ్ట్వేర్ను గుర్తుచేస్తుంది.ఓటరు ప్రస్తుతం ఉన్న ఫారాన్ని నింపినప్పుడు 2002నాటి డేటాబేస్లో కొత్త పేరు కానిస్టిటెన్సీ) చేస్తుంది.దీనివల్ల పాతచోట ఓటు నమోదు అవుతుంది.2002 రికార్డుల్లో మీ ఓటు దొరక్కపోయినా ప్రస్తుత నివాస ప్రాంతంలో మీరు స్థానికులేనని నిరూపించే ప్రత్యామ్నాయ పత్రాలను (ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు,రిజిస్టర్డ్ సెల్డీడ్,పాస్పోర్ట్) పరిశీలించి ప్రస్తుత ఓటును ఖరారు చేస్తారు.కొత్తగా ఓటును నమోదు చేసుకోవచ్చు.
వారి తండ్రి,తల్లికి సంబంధించిన 2002 ఓటరు ఐడీ రికార్డుతో పిల్లల ఓటును లింక్ చేస్తారు.ఓటరు పేరులో అక్షర దోషం లేదా ఇంటిపేరు మార్పు ఉంటే ఆధార్ కార్డు,పాన్ కార్డు,పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్,పదో తరగతి మార్కుల మెమో వంటివాటిని సమర్పించాలి.
వయసు లేదా జన్మతేదీల్లో తేడా ఉంటే జనన ధ్రువీకరణ పత్రం,పదో తరగతి మెమో, ఆధార్ కార్డు పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాలి.తల్లిదండ్రుల పేర్లు, బంధుత్వాల్లో తేడాలుంటే కుటుంబ రేషన్ కార్డు,కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు,ఓటరు గుర్తింపు కార్డులు,పాఠశాల రికార్డులను సమర్పించాలి.


