విశాలాంధ్ర ధర్మవరం;; తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల మేరకు 6 దేవాలయాల పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు శ్రీవాణి ట్రస్ట్ నిధుల కింద ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సిద్దయ్యగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధి పనులకు 50.85 లక్షలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ నిధులు వచ్చిన వెంటనే ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

