కరుప్పు 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్: ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సాధారణంగా విడుదలైన తమిళ హీరో ‘సూర్య’ నటించిన ‘కరుప్పు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ముఖ్యంగా వర్కింగ్ డేస్ లో నమోదు అవుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు నివ్వెరపోయారు. సూర్య స్టార్ స్టేటస్ పై అనుమానాలు పెట్టుకున్న ప్రతీ ఒక్కరిని ఈ సినిమా ఫూల్ చేసింది. తెలుగులో ఈ చిత్రం ‘వీరభద్రుడు’ అనే పేరు విడుదలైంది. ఇక్కడ ఈ విడుదల మొదటి రోజున 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అయితే , 5 వ రోజున 2 కోట్ల 30 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో మీరే చూడండి. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి.
మొదటి రోజు ఈ చిత్రం తమిళనాడులో 11 రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వగా, 5 వ రోజున 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రజినీకాంత్ కి తప్ప, ఏ హీరో కి కూడా తమిళనాడులో వరుసగా 5 రోజులు 10 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చిన దాఖలాలు లేవు, అలాంటిది ఇప్పుడు రజినీకాంత్ జాబితాలోకి సూర్య కూడా చేరిపోయాడు. 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారిగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందించే సమాచారం ప్రకారం ఈ చిత్రం 17 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు 8 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
అంటే వారం కూడా అవ్వకముందే ఈ పూర్తి 1 కోటి 80 లక్షల రూపాయల లాభం వచ్చింది అన్నమాట. అదే విధంగా తమిళనాడులో ఈ చిత్రం 72 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి, కర్ణాటక నుండి 12 కోట్ల 50 లక్షలు, కేరళ నుండి 8 కోట్ల 80 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్లు, ఓవర్సీస్ నుండి 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 163 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు , 79 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అన్ని భాషలకు కలిపి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఈ సినిమా 70 కోట్లకు జరిగింది , ఇప్పటికే 9 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి, రాబోయే రోజుల్లో ఎంత లాభాలు వస్తాయో చూడాలి.

