బీఆర్ఎస్ నేతలు ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. హైదరాబాద్ లో తలెత్తిన నీటి ఎద్దడిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలు, కుండలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం అసమర్థతను ప్రశ్నించడానికే ఇక్కడకు వచ్చామని వారు చెప్పారు.
నీటి ఎద్దడిని తొలగించాలని…
ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. హైదరాబాద్ నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నీళ్లు రావడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీటి సరఫరాను మెరుగుపర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచిస్తుంది.

