హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. అమృత్ స్టేషన్‌గా రూ.26 కోట్లతో హైట్ సిటీ రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించారు. రూ.26 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. అన్ని పనులు పూర్తయ్యాయి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా అమృత్ స్టేషన్ల పేరుతో రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరించింది.
హైదరాబాద్, సైబరాబాద్, ఐటీ కారిడార్‌కు అత్యంత సమీప రైల్వే స్టేషన్ ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. సికింద్రాబాద్ డివిజన్ స్టేషన్‌ని సబ్-అర్బన్. లింగంపల్లి–సికింద్రాబాద్ MMTS మార్గంలో కీలక స్టేషన్. రోజుకు సుమారు 62 సబర్బన్ రైళ్లు ఈ స్టేషన్ మీదుగా నడుస్తాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, ఉమ్దానగర్, ఫలక్‌నుమా, మేడ్చల్, ఘట్కేసర్ ప్రాంతాలకు రైలు సౌకర్యం. రోజుకు సుమారు 3 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను వినియోగిస్తున్నారు.
కొత్తగా కల్పించిన సౌకర్యాలు:
- ప్రధాన ప్రవేశ ద్వారం (Entrance Portico) ఆధునికీకరణ.
- సర్క్యులేటింగ్ ఏరియా విస్తరణ, మెరుగుదల.
- ఇప్పటికే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌కు అదనంగా 12 మీటర్ల వెడల్పు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం.
- ప్రయాణికుల రాకపోకలకు మెరుగైన కనెక్టివిటీ.
- ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, మెరుగైన యాక్సెసిబిలిటీ.
- స్టేషన్ పరిసరాల అభివృద్ధి, శుభ్రత, సౌకర్యాల విస్తరణ.

