సూర్య కరుప్పు 200 కోట్ల క్లబ్: సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేసిన ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకి మొదటి షో తో డివైడ్ టాక్ వచ్చినప్పటికి క్రమక్రమంగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది. గతవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఈ సినిమా ఇప్పటివరకు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది అంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
సూర్య ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయినప్పటికి ఆయనకు సక్సెస్ దక్కడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు భారీ విజయమైతే దక్కింది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లుగా మారాయి. దానివల్ల అతని మార్కెట్ పూర్తిగా పడిపోయింది. తమిళ్ తో పాటు తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగొందిన ఆయన ఈ మధ్య సక్సెస్ ల విషయంలో వెనుకబడిపోవడం వల్ల ఆయన తన పూర్తి ఫామ్ ని అందుకోలేకపోతున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన ఆయన తన తదుపరి సినిమా వెంకీ అట్లూరితో చేస్తున్నాడు. అందుకే ఆ సినిమాతో కూడా భారీ విజయాన్ని సాధిస్తాననే కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ ప్రయత్నం అంటే చెప్పాలి. సూర్య కెరియర్ లోనే ఇలాంటి సినిమా మరోసారి రాదని ఆయన పలు సందర్భాల్లో చెబుతున్నాడు.
ఇక ఈ వంటినే సూర్య తెలుగులో సైతం మరోసారి తన సత్తా చాటాడు. గత సంవత్సరం వచ్చిన కంగువ సినిమాతో భారీ దెబ్బ తిన్న ఆయన ఆ తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలతో సైతం డీలా పడ్డాడు… ఇక ఇప్పుడు విజయాన్ని అందుకోవడంతో అతని అభిమానులు పండగ చేసుకుంటున్నారు…

