CSK vs GT: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ప్లేఆఫ్స్ రేసులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తడబడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్ల 229 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, గిల్, బట్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో ఆ జట్టు భారీ స్కోర్ చేసింది.
230 పరుగుల టార్గెట్ ఛేదన కోసం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది. గాయంతో మైదానం వీడిన అనంతరం బ్యాటింగ్ కి చేరుకున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ ఇన్సింగ్స్ ఫస్ట్ ఓవర్ వేసిన మహమ్మద్ సిరాజ్ వేసిన మొదటి బంతికే జోస్ బట్లర్ కి క్యాచ్ ఇవ్వడంతో.. గోల్డెన్ డక్ గా పెవిలియన్ కి చేరుకున్నాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మంచి టచ్ లో కనిపించాడు, 16 రన్స్ చేసిన తర్వాత సిరాజ్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. గైక్వాడ్ నిష్ర్కమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మియా భాయ్ (సిరాజ్) బౌలింగ్ లోనే బౌండరీ లైన్ వద్ద ఉన్న ప్రసిద్ధ కృష్ణకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.
►ఇంకా చదవండి |ఎస్ఎస్కే బౌలర్లపై చెడుగుడు ఆడిన గిల్, సుదర్శన్, బట్లర్.. చెన్నై ముందు 230 రన్స్ టార్గెట్
అనంతరం జట్టు స్కోర్ బోర్డుని ముందుకు నడిపించే ప్రమాదకరంగా మారుతున్న ఓనర్ మాథ్యూ షార్ట్ (24)ని కగిసో రబాడ బౌలింగ్ లో ప్రసిద్ధ కృష్ణ క్యాచ్ పట్టుకోవడంతో డగౌట్ కి వెళ్లాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కార్తీక్ శర్మ కాసేపు బ్యాట్ ఝలిపించాడు, 19 రన్స్ చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు. దీంతో 63 పరుగులకే కీలకమైన 5 వికెట్లను చెన్నై సూపర్ కింగ్స్ నష్టపోయింది. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసుకోగా, రబాడ ఒక వికెట్ పడగొట్టాడు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై.. ప్లేఆఫ్స్ కి చేరేనా!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

