మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఇంకా ఎందుకు యాక్టీవ్ అవలేదు? పొలిటికల్ డార్క్‌లోకి వెళ్ళిపోయి రెండేళ్ళు గడుస్తున్నా… ఇంకా స్క్రీన్ మీదికి రాకపోవడానికి కారణాలేంటి? సర్జరీ పూర్తయి నెలలు గడుస్తున్నా… కనీస రాజకీయ కార్యకలాపాల్లో కూడా ఎందుకు పాల్గొనడం లేదు? ఆయన గురించి రాజకీయవర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? నియోజకవర్గంలో ఏమనుకుంటున్నారు? ఏపీ పొలిటికల్ ఫైర్‌బ్రాండ్స్‌లో ఒకరు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడ నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచిన నాని…. గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు. మొదట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుటుంబంపై దూకుడుగా మాట్లాడే కొడాలి…. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా జోరు పెంచారు. ఆ దెబ్బకు పసుపు పార్టీ హిట్ లిస్టులో చేరిపోయారాయన. ఇక గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి హిట్ లిస్టులో ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్‌పై కేసులు, అరెస్టుల్లాంటివి వరుసగా జరిగాయి. అలాంటి అరెస్ట్‌ల జాబితాలో కొడాలి నాని కూడా ఉంటారని చాలా మంది ఊహించారు. అయితే… ఆయనపై పలు కేసులు నమోదైనా… అరెస్టులు మాత్రం జరగలేదు. అదే సమయంలో హార్ట్ సర్జరీ జరగడంతో పూర్తిగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నది కొడాలి సన్నిహితుల మాట. కానీ… చాలా రోజులైన ఆపరేషన్ కావాలంటే… నాని రీ ఎంట్రీ ఎప్పుడంటూ… వైసీపీ కేడర్‌లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి టీడీపీ హిట్ లిస్ట్‌లో ఉన్న ముఖ్య నేతలు పేర్ని నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ వంటి వారిపై అనేక కేసులు నమోదు అయ్యాయి. వల్లభనేని వంశీ ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పూర్తి క్రియాశీలకంగా ఉన్నారు పేర్ని నాని. ఆయన మీద కూడా అనేక కేసులు నమోదయ్యాయి… అరెస్ట్ అవ్వలేదు. తన గళం గట్టిగానే వినిపిస్తోంది పేర్ని. అయితే గుడివాడ నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో స్థానికంగా ఉన్న నేతలు మాత్రమే పాల్గొంటున్నారు.
గతంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాత్రమే కొడాలి నాని కొనసాగింది. సర్జరీ జరిగింది, ఆరు నెలలపాటు రెస్ట్ తీసుకొని తిరిగి పూర్తిగా యాక్టీవ్ అని ఆయన ప్రకటించడంతో శ్రేణులు ఎదురు చూశాయి. అయితే… గడుస్తున్నా… ఇప్పటికీ ఆయన రంగంలోకి దిగపోవటంతో ఎప్పుడు వస్తారు? ఎందుకు ఆలస్యం అవుతోందంటూ… సొంత కేడర్ ఆరా తీస్తోందట. అయితే… కొడాలి నాని పూర్తి స్థాయిలో పాలిటిక్స్ చేయకున్నా… నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలను పలకరించడం, వాళ్లకు సంబంధించిన శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేస్తున్నారట. అయితే… క్షేత్రస్థాయిలోకి దిగాలని క్యాడర్ కోరుకోవడం వెనక వేరే కారణాలు కనిపిస్తున్నాయి. అధికారులు, ప్రభుత్వ వ్యవహారాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా…. నియోజకవర్గ విపక్ష నేతగా నానిని కలిసి ఇబ్బందులు చెప్పుకుందామంటే కుదరడం లేదట. ఇలాంటి మా లీడర్ దగ్గర ఉంటే… ఆ పని జరగడంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మీద పెరిగే వ్యతిరేకతను కూడా అనుకూలంగా మల్చుకోవచ్చన్నది వైసీపీ కేడర్ అభిప్రాయం. ఆయన అందుబాటులో లేకపోవడం వల్లే తాము కూడా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నామన్నది వాళ్ళ వాయిస్. అయితే…. సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంది… కొడాలి నాని ఇంకా ఇవ్వడానికి సమయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అంతే తప్ప…. ప్రభుత్వం పెట్టిన కేసులకు భయపడని కూటమి అంటున్నారు. మొత్తం మీద ఆయన నేరుగా రంగంలోకి దిగితేనే గుడివాడ వైసీపీ కేడర్‌లో ఊపందుకుంటున్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం.

