జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన
విశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత, పోక్సో, కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు. ధర్మవరం సబ్ డివిజన్ నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. కేసుల విచారణల పెండింగ్ మహిళా విచారణ దశలో ఉన్న కేసుల పురోగతి, ఫోక్సో కేసులు, సంబంధిత నేరాలు, గ్రేవ్ నాన్ గ్రేవ్ గంజాయి కేసుల దర్యాప్తు వంటి వాటిపై స్టేషన్ల వారీగా సమీక్షించారు. డ్రోన్ల ద్వారా నిఘా, రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలపై పర్యవేక్షణ, రోడ్డు భద్రత చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు తదితర అంశాలు
విచారణలో ఉన్న కేసులను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మహిళా సంబంధిత నేరాలు, ఫోక్సో కేసుల్లో పక్కా సాక్ష్యాధారాలతో దర్యాప్తు నిర్ణీత గడువులోగా చార్జ్షీట్లు దాఖలు చేయాలని కోరింది. అలాగే రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీ గారితో పాటు, సిఐ లు రెడ్డప్ప నాగేంద్రప్రసాద్, ప్రభాకర్ మహమ్మద్ అలీ, సునీత , శివ రాముడు, ఎస్సైలు ఉన్నారు.

