కర్నూలులో విషాదం | మంత్రాలయం: కర్నూలు జిల్లాలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం సమీపంలోని తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. గల్లంతైన వారిని హైదరాబాద్కు చెందిన ఐదేళ్ల బాలుడు యువన్ చంద్ర, సతీష్(35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర (25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య(22)గా పోలీసులు పేర్కొన్నారు. నదిలో స్నానానికి దిగి ఒకేసారి ఐదుగురు మునిగిపోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతా మంత్రాలయంలోని తమ బంధువుల ఇంట్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం పూజ అనంతరం, కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా గడపడానికి సమీపంలోని తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడ నదిలోకి దిగిన వీరు, నీటి లోతు ఎంత ఉందో సరిగ్గా అంచనా వేయలేకపోయారు. లోతు ఎక్కువగా ఉండటం, ప్రవాహ వేగం కారణంగా ఒక్కసారిగా అందరూ నీటిలో మునిగిపోయి గల్లంతయ్యారు.
ఇది కూడా చదవండి: ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు – భార్యపై చేసిన కుట్రతోనే – ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆదోనికి చెందిన అపర్ణ అనే మహిళా బంధువు ప్రవాహం నుంచి సురక్షితంగా బయటపడటంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపర్ణ ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు. ప్రస్తుతం గల్లంతైన మిగిలిన ఐదుగురి ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారులు, గజ ఈతగాళ్లతో నదిలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Also Read: Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
ఇంకా చదవండి

